Mahesh Babu On DTTT Movie: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి(Rajamouli) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం “డోంట్ ట్రబుల్ ద ట్రబుల్”(Don’t Trouble The Trouble). ఈ సినిమా గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా కొంతమంది సెలబ్రిటీలకు ప్రత్యేక షోల ద్వారా చూపించారని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా చూశారని ఈ సినిమా చూసిన అనంతరం ఈయన ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. ఇప్పుడే తాను డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా చూశాను. ఎంతో అద్భుతమైన అనుభూతిని కలిగించే సినిమా.చాలా చక్కగా తెరకెక్కించిన ఒక హ్యాపీ ఫిలిం. మనసును హత్తుకుంటూనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని తెలిపారు.
ఇక మహేష్ బాబు నటుడు ఫహద్ ఫాసిల్(Fahadh Faasil) గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. సర్ మీరు అద్భుతమైన గొప్ప నటుడు. మీరు ఇండస్ట్రీలో ఎదుగుతూ సరికొత్త ప్రయోగాలు చేస్తూ మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. మన చిన్నారి క్యూట్ సారా, ఫహద్ సర్ చేసిన నటన అద్భుతంగా ఉంది. ప్రతిక్షణం ఆ పాత్రలో జీవిస్తున్నట్లు, అనుభూతి చెందుతున్నట్లు కనిపించిందని తెలిపారు. ఇక నిర్మాత కార్తికేయ (Karthikeya)గురించి కూడా ప్రస్తావిస్తూ ఇంతకంటే ప్రత్యేకమైన ఆరంభాన్ని మీరు కోరుకోలేరు. ఈ సినిమా కోసం మీరు పెట్టిన శ్రమ అంకితభావం తర్వాత మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు.మీరు శోభు యార్లగడ్డ కలిసి ఎంతో ప్రత్యేకమైన చిత్రాన్ని సృష్టించారు.
Just watched the #DontTroubleTheTrouble Movie!!!What a beautifully complete experience this is ❤️❤️❤️ Such a well crafted and happy film… thoroughly entertaining and deeply moving at the same time 👏🏻👏🏻👏🏻 The film carries such a rare sense of warmth throughout!!!
Fahadh sir – u…
— Mahesh Babu (@urstrulyMahesh) September 30, 2026
ఇక దర్శకుడు శశాంక్ గురించి కూడా మహేష్ ప్రస్తావిస్తూ మీరు చాలా అద్భుతంగా పనిచేశారని.. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాను తెరపైకి తీసుకు రావడం అభినందనీయం అంటూ దర్శకుడిపై కూడా ప్రశంసలు కురిపించారు. మొత్తం చిత్ర బృందానికి నా ప్రేమాభిమానాలు మీ చేతిలోకి అద్భుతమైన ఆణిముత్యం ముందే అక్టోబర్ రెండో తేదీ ప్రతి ఒక్కరు కూడా ఈ మాయాజాలాన్ని తప్పకుండా అనుభవించాలి అంటూ మహేష్ బాబు ఈ సినిమా గురించి ఇచ్చిన ఈ పాజిటివ్ రివ్యూతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
Also Read: యాంకర్ గా 25 ఏళ్ల ప్రస్థానం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సుమ కనకాల!