Endhayya saami Song: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం రణబాలి(Ranabaali). ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఇదివరకే ఈ సినిమా నుంచి ఏందయ్యా సామి (Endhayya saami)పాటకు సంబంధించిన చిన్న ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటకు శ్వేతా మోహన్ (Shweta Mohan) అజయ్ గోగవాలే (Ajay Gogavale) ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ సినిమాకు అజయ్ – అతుల్ (Ajay-Atul) సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ పాట నిన్ననే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాలో సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. రష్మిక మందన్న జయమ్మ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరి మధ్య సాగే రొమాంటిక్ పాటగా ఏందయ్యా సామి ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే..19వ శతాబ్దంలో బ్రిటీష్ పాలన కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే చిత్ర బృందం షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా విడుదలకు కేవలం పాతిక రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలుపెట్టారు.
ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఒక చిన్న గ్లింప్స్ వీడియో విడుదల చేయగా, ఎంతో మంచి ఆదరణ లభించింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రష్మిక విజయ్ దేవరకొండ ఇదివరకు రెండు సినిమాలలో నటించారు కానీ ఈ సినిమా మాత్రం వీరి అభిమానులకు ఎంతో స్పెషల్ గా ఉండబోతుందని చెప్పాలి. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో విజయ్ రష్మిక అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం మంచి అంచనాలను పెంచేశాయి. అక్టోబర్ 16వ తేదీ ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
Also Read: మనల్ని ఎవరు ఆపలేరు…థియేటర్లు తగలబడి పోవాల్సిందే..నాని స్పీచ్ వైరల్!