E-Paper
Advertisement

‘ది ప్యారడైజ్’ సినిమా పై వేణు స్వామి రివ్యూ .. సమస్యలు తెచ్చుకోవద్దంటూ!

‘ది ప్యారడైజ్’ సినిమా పై వేణు స్వామి రివ్యూ .. సమస్యలు తెచ్చుకోవద్దంటూ!
Advertisement

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందిన ఈయన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఫేమస్ అయ్యారు. గత కొద్ది రోజుల క్రితం వరకు సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. అయితే ఈయన సినిమా సెలబ్రిటీల గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో వేణు స్వామి సినిమా సెలబ్రిటీల గురించి ఇటీవల కాలంలో ఎక్కడ ప్రస్తావించలేదు అయితే తాజాగా వేణు స్వామి నాని(Nani) నటించిన ది ప్యారడైజ్ (The Paradise)సినిమా గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలిపారు.

ధూమావతి అమ్మవారు ఎవరు..

తాజాగా వేణు స్వామి(Venu Swamy) ది ప్యారడైజ్ సినిమా చూసానని తెలియజేశారు అయితే ఈ సినిమా చూడటానికి గల కారణం ఏంటనే విషయాన్ని కూడా ఈయన తెలియజేశారు. ఈ సినిమా తాను చూడటానికి ప్రధాన కారణం ధూమావతి అమ్మ(Dhumavathi amma) అని తెలిపారు. దశ మహా విద్యలలో ప్రముఖులు అయినటువంటి ధూమావతి అమ్మవారిని అలాగే ధూమావతి అమ్మవారి వాహనమైన కాకి గురించి ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఉన్నాయని అనిపించింది. అందుకే తాను ఈ సినిమా చూశానని వేణు స్వామి ఈ సందర్భంగా తెలిపారు.

అమ్మవారిని టచ్ చేయాలంటే దమ్ము ఉండాలి..

Advertisement

ఇలా ఈ అమ్మవారి గురించి వేణు స్వామి మాట్లాడుతూ ఈ అమ్మవారు ఉగ్రరూపానికి చెందిన అమ్మవారని తెలిపారు. ఇలాంటి ఉగ్ర రూప అమ్మవారిని పూజించేటప్పుడు ఎన్నో నియమనిష్టలను పాటించాలని పూజలు కూడా చేయాల్సి ఉంటుందని తెలియచేశారు. అయితే పారడైజ్ సినిమాలో ఒక ఫైట్ సన్నీ వేషంలో ధూమావతి అమ్మవారిని , అమ్మవారి వాహనాన్ని చూపించడమే కాకుండా మంత్రాన్ని ఆరా రూపకంగా మనకు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ద్వారా వినిపించారని వేణు స్వామి తెలిపారు. దశమహా విద్యులలో ఒకరైన ధూమావతి అమ్మవారిని టచ్ చేయాలి అంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలని వేణు స్వామి తెలిపారు.

?stkn=aDNnaHpvczdkdWNj

Advertisement

ఈ ధూమవతి అమ్మవారు స్వయంగా శివుడిని మింగిన అమ్మవారు. తెల్ల చీర కట్టుకొని చీపురు చాట చేత పట్టుకొని ఉగ్రరూపంలో ఉండే అమ్మవారి గురించి సినిమాలు చేయాలన్నా, వీరిని పూజించి ఆవాహనం చేసుకోవాలన్న చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ అమ్మవారి జోలికి వెళ్లకపోయినా పర్లేదు కానీ తెలిసి తెలియకుండా పూజలు చేసి సమస్యలు కొని తెచ్చుకోకూడదని వేణు స్వామి తెలిపారు. ఇలా ఈ సినిమాలో ధూమావతి అమ్మవారిని చూపించడం వల్లే తాను సినిమా చూశానని వేణు స్వామి తెలియజేస్తూ అమ్మవారి విశిష్టతను కూడా తెలిపారు. ఇలా ధూమవతి అమ్మవారి గురించి ప్యారడైజ్ సినిమా గురించి వేణు స్వామి చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: నైజాంలో నాని మేనియా..రెండు రోజులకే బ్రేక్ ఈవెన్?

Related News

నైజాంలో నాని మేనియా..రెండు రోజులకే బ్రేక్ ఈవెన్?

మహేష్ ‘వారణాసి’ పై కార్తికేయ బిగ్ అప్డేట్..గట్టిగనే ప్లాన్ చేస్తున్నారే!

‘ది ప్యారడైజ్ ‘.. కేసీఆర్ రోల్ పై రాహుల్ రామకృష్ణ ట్వీట్!

డబ్బింగ్ షూర్ చేసిన ‘ కాకా ‘ .. సంక్రాంతి విడుదలకు సిద్ధం!

తప్పుగా తీసుకోవద్దు.. జర్నలిస్టు నాగేంద్ర వివాదంపై సంపూర్ణేష్ బాబు వివరణ!

అంతా మీ ఇష్టమే.. ‘ది ప్యారెడైజ్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై స్పందించిన నాని

మాల్దీవ్స్ లో నయనతార.. 2 రోజుల బస కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

Big Stories

Advertisement
×