E-Paper
Advertisement

‘ రాకా’ విషయంలో కీలక మార్పులు.. రెండు భాగాలుగా రాబోతోందా?

‘ రాకా’ విషయంలో కీలక మార్పులు.. రెండు భాగాలుగా రాబోతోందా?
Advertisement

Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. రాకా(Raaka) పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్స్ మాత్రం వెల్లడించలేదు. ఈ సినిమా విడుదల విషయంలో అభిమానులలో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

రాకా రెండు భాగాలుగా రాబోతోందా?

ఈ సినిమా 2027లో విడుదలవుతుందని భావించారు కానీ 2028 వరకు ఈ సినిమా కోసం ఎదురుచూడాల్సిందేనని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విషయంలోకి చిత్ర నిర్మాతలు కీలక మార్పులు చేశారనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాని ఒక భాగం కాకుండా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా ఓకే భాగంగా విడుదలయితే ఈ సినిమా కోసం 2028 వరకు వేచి ఉండాలని, రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తే మొదటి భాగం 2027 లోనే విడుదలవుతుందని తెలుస్తోంది.

మూడు విభిన్నమైన పాత్రలలో అల్లు అర్జున్..

Advertisement

ఈ సినిమా కథ రెండు భిన్నమైన ప్రపంచాలు, టైమ్‌లైన్స్‌లో కొనసాగుతోందని,పౌరాణిక,వేద కాలానికి సంబంధించిన భాగంతో పాటు ఆధునిక ప్రపంచానికి సంబంధించిన కథ కూడా ఇందులో చూపెట్టబోతున్నారని అందుకే అల్లు అర్జున్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా మూడు విభిన్నమైన పాత్రలలో ఉండబోతున్న నేపథ్యంలో చాలా నిడివి ఉండబోతుందని అందుకే ఈ సినిమాని రెండు భాగాలుగా చేయాలా లేదా ఒకే భాగంగా విడుదల చేయాలా అనే ఆలోచనలో చిత్ర నిర్మతలు ఉన్నట్టు తెలుస్తోంది.

70% షూటింగ్ పూర్తి..

Advertisement

రాకా సినిమా కథ పరిధి, బడ్జెట్, షూటింగ్ టైమ్‌లైన్‌తో పాటు రెండు భాగాలుగా విడుదల చేస్తే వచ్చే లాభాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 70% షూటింగ్ పూర్తి అయిందని రషెస్ చూసుకున్న తర్వాత ఈ సినిమాని ఒకే సినిమాగా విడుదల చేయాలా? లేదంటే రెండు భాగాలుగా చేయాలా ?అనే నిర్ణయానికి రాబోతున్నట్టు సమాచారం. ఇలా ఈ సినిమా విడుదల విషయంలో చిత్ర నిర్మాతలు కూడా తరజన భర్జన అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెల్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం జరగబోయే ఈ యాక్షన్ సీక్వెల్లో భాగంగా రష్మిక మందన్న షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన్న నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నారు . ఇక ఇందులో రమ్యకృష్ణ, జాన్వీ కపూర్, యోగిబాబు, జిమ్ సర్భ్ వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు.

Also Read: ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ‘ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

Related News

బిగ్ బాస్ కృష్ణుడు కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో?

ఎఫ్డిఏ నోటీసులపై షారుక్ , అజయ్ , టైగర్ ష్రాఫ్ రియాక్షన్?

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫెడరేషన్ కీలక నిర్ణయం!

కేసీఆర్ పాత్ర అద్భుతంగా చేశావు.. ప్రియదర్శిని సత్కరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే!

ప్రత్యేకంగా ఆ అభిమానిని కలిసిన తారక్.. వీడియో వైరల్!..

‘గబ్బర్ సింగ్’ రమేష్ కి అండగా నటుడు శ్రీమాన్!

అజిత్ ఒక్కో యాడ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×