How long food safe in fridge: కరెంట్ పోవడం అనేది మనలో సర్వసాధారణం. అకస్మాత్తుగా.. వర్షాలు పడినప్పుడు లేదా మెయింటెనెన్స్ వర్క్స్ ఉన్నప్పుడు గంటల తరబడి పవర్ కట్ అవుతుంటుంది. ఇలా కరెంట్ పోయిన ప్రతి సారీ ఇంట్లోని వచ్చే పెద్ద టెన్షన్.. ఫ్రిజ్‌లో ఉన్న పాలు, కూరగాయలు, చికెన్, మటన్, ఇతర స్నాక్స్ గురించే! కరెంట్ లేకపోతే.. ఫ్రిజ్ కూలింగ్ తగ్గిపోయి ఆహారం త్వరగా పాడైపోతుంది. మరి ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం పవర్ కట్ అయిన తర్వాత అసలు ఎంతసేపు పాడవకుండా ఉంటుంది? ఏవి తినొచ్చు? ఏవి చెత్తబుట్టలో వేయాలి? అనే విషయాలపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కరెంట్ పోయిన.. తర్వాత మీరు ఫ్రిజ్ డోర్‌ను పదే పదే తెరవకపోతే, అందులోని కూలింగ్ అలాగే ఉండి ఆహారాన్ని కొంతవరకు కాపాడుతుంది. ఎలాంటి పవర్ లేకపోయినా.. మూసి ఉన్న రిఫ్రిజిరేటర్ దాదాపు 4 గంటల పాటు లోపలి పదార్థాలను పాడవకుండా ఉంచగలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఫ్రీజర్ విభాగం పూర్తిగా నిండి ఉంటే.. అది దాదాపు 48 గంటల పాటు (సరిగ్గా మూసి ఉంటే 24 నుంచి 48 గంటలు) చల్లదనాన్ని కోల్పోకుండా ఫుడ్‌ను కాపాడుతుంది. అదే హాఫ్-ఫిల్డ్ ఫ్రీజర్ అయితే దాదాపు 24 గంటల పాటు కూలింగ్‌ను నిలబెట్టుకోగలదు.
పవర్ కట్ అయిన సమయాన్ని బట్టి.. ఏ ఆహారం సేఫ్‌గా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
పాలు, పాల పదార్థాలు, పెరుగు, మీగడ: ఇవి చాలా త్వరగా పాడైపోతాయి. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ కంటే పెరిగితే.. పాలు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు నిల్వ ఉండవు. వాసన మారిపోతే.. వాటిని అస్సలు వాడకూడదు.
కూరగాయలు & పండ్లు: కట్ చేయని తాజా పండ్లు, కూరగాయలు పవర్ కట్ అయినప్పటికీ.. రోజంతా తాజాగా ఉండే అవకాశం ఉంది. కానీ కట్ చేసిన ఫ్రూట్స్ లేదా అప్పటికే వండిన కూరలు త్వరగా చెడిపోతాయి.
మాంసం, చేపలు, చికెన్: పచ్చి మాంసం, చేపలు ఫ్రిజ్‌లో కరెంట్ లేకపోతే గంటల వ్యవధిలోనే.. బ్యాక్టీరియా వృద్ధి చెంది పాడైపోతాయి. వాటిని ఎక్కువ సేపు ఉంచడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
బట్టర్, చీజ్: హార్డ్ చీజ్ , బట్టర్ రూమ్ టెంపరేచర్‌లో కూడా కొంతకాలం నిల్వ ఉంటాయి కాబట్టి ఇవి సాధారణంగా త్వరగా పాడవవు.
మార్కెట్లో కొత్త టెక్నాలజీ ఫ్రిజ్‌లు:
ఈ రోజుల్లో పవర్ కట్ సమస్యను ఎదుర్కొనేందుకు మార్కెట్లో అడ్వాన్స్‌డ్ ఇన్వర్టర్ రె్రిజిరేటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కరెంట్ లేనప్పుడు కూడా లాంగ్ లాస్టింగ్ కూలింగ్‌ను అందిస్తాయి. ప్రముఖ బ్రాండ్ల ఇన్వర్టర్ ఫ్రిజ్‌ల ధరలు వాటి కెపాసిటీ , మోడల్‌ను బట్టి సుమారు రూ.20,000 నుంచి రూ.60,000 వరకు ఉంటాయి. పవర్ కట్ సమస్య ఎక్కువగా.. ఉండే ప్రాంతాల వారు ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఫ్రిజ్‌లను కొనడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: జేబీఎల్ హెడ్‌ఫోన్స్ మస్ట్ బై డీల్స్..అమెజాన్ ఫెస్టివల్ సేల్ స్పెషల్
1.కరెంట్ మళ్లీ వచ్చిన తర్వాత ఫ్రిజ్‌లోని పదార్థాలను చెక్ చేయడం చాలా ముఖ్యం.
2.ఆహారం నుంచి ఏదైనా చెడు వాసన వస్తుందా అని గమనించాలి.
3.రంగుమారిన కూరగాయలు లేదా విరిగిన పాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
4.ఒకవేళ మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా.. “When in doubt, throw it out” (సందేహం వస్తే పడేయండి) అనే గోల్డెన్ రూల్ ఫాలో అవ్వడం మీ కుటుంబ ఆరోగ్యానికి చాలా మంచిది.
పవర్ కట్ అయినప్పుడు అనవసరంగా ఫ్రిజ్ డోర్ తీయడం మానేయండి. ఈ చిన్న పాటి జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లోని ఆహారాన్ని వేస్ట్ కాకుండా కాపాడుకోవచ్చు.