Baahubali Animation: బాహుబలి సినిమాతో భాషల బ్యారియర్స్ బద్దలు కొట్టిన జక్కన్న ఇపుడు మరో సంచలనానికి తెర తీశాడు.అవును…మొదటగా వెయ్యి కోట్ల గేట్లని బార్లా తెరిచిన జక్కన్న మరో రికార్డుని లిఖిస్తున్నాడు.ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’ల తన టీమ్‌తో కలిసి సందడి చేస్తున్నాడు.
భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ యానిమేషన్ మూవీ ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రపంచ సినిమా ప్రతినిధుల ముందు మెరిసింది. నిర్మాత శోభు యార్లగడ్డ, ఎస్‌ఎస్ కార్తికేయలతో కలిసి రాజమౌళి ఫ్రాన్స్‌లో సందడి చేస్తుండటంతో గ్లోబల్ మీడియా కళ్లు ఇప్పుడు టాలీవుడ్ వైపు మళ్లాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో యానిమేషన్ చిత్రాలకు అత్యున్నత పురస్కారంగా భావించే ఈ ఫెస్టివల్‌లో, ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రతిష్టాత్మకమైన ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ (WIP) కేటగిరీకి ఎంపిక కావడం విశేషం.
Bonjour, Annecy! 📍🇫🇷@ssrajamouli, @Shobu_ and @ssk1122 at #Annecy2026 for #BaahubaliTheEternalWar WIP sessions and #RRR Screening! 🌎🔥 pic.twitter.com/YXPN1Ul9Nz
— Baahubali (@BaahubaliMovie) June 24, 2026
గతంలో ఆస్కార్ అవార్డును కొల్లగొట్టిన ‘స్పైడర్-మాన్: ఇన్ టూ ది స్పైడర్-వర్స్’ (2018), అలాగే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న ‘ఫ్లో’ వంటి విజువల్ వండర్స్ కూడా విడుదలకు ముందు ఇదే WIP సెషన్‌లో ప్రదర్శితమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు అదే లైనప్‌లో మన ‘బాహుబలి’ యానిమేషన్ చిత్రం చేరడం భారతీయ యానిమేషన్ రంగానికే గర్వకారణం. ఈ సెషన్స్‌లో పాల్గొన్న జక్కన్న అండ్ టీమ్, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని ఎక్స్‌క్లూజివ్ విజువల్స్‌ను, మేకింగ్ డీటెయిల్స్‌ను అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్‌కు అందించారు. మహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన సరికొత్త యుద్ధ సన్నివేశాలు, మునుపెన్నడూ చూడని గ్రాఫిక్స్ ఈ చిత్రంలో ఉండబోతుందని టాక్
also read:నేషనల్ అవార్డుల వార్ ..చిరంజీవి బన్నీని టార్గెట్ చేశాడా…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
ఈ వేడుకల్లో ‘బాహుబలి’ మాత్రమే కాదు, 2022లో విడుదలై గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా ‘నాటు నాటు’ సాంగ్‌తో ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలిచిన ‘ఆర్‌ఆర్ఆర్’ (RRR) చిత్రం కూడా మరోసారి హైలైట్‌గా నిలిచింది. ఈ ఫెస్టివల్‌లో ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమాకు ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేయగా, అక్కడి విదేశీ ప్రేక్షకులు థియేటర్లలో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్స్, రాజమౌళి టేకింగ్‌కు హాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు.
also read:సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య ఏం లేదా ..?
విజువల్ వండర్స్‌ను తెరకెక్కించడంలో రాజమౌళి శైలి ఎలాంటిదో 2015లో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలతోనే ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను యానిమేషన్ రూపంలో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకువెళ్లేందుకు రాజమౌళి పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఈ గ్లోబల్ ఈవెంట్‌లో పాల్గొన్న విశేషాలను, అక్కడి అద్భుతమైన క్షణాలను రాజమౌళి టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘బాన్‌జోర్ అన్నెసీ’ (హలో అన్నెసీ) అంటూ వారు పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేవలం లైవ్ యాక్షన్ సినిమాలతోనే కాకుండా, యానిమేషన్ రంగంలోనూ ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపిస్తూ 2026లోనూ రాజమౌళి తన గ్లోబల్ విక్టరీ టూర్‌ను కంటిన్యూ చేస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో !
also read:స్క్రీన్ పై నీతులు… స్క్రీన్ వెనుక కోతులు.. టాలీవుడ్ పై సింగర్ సునీత పంచ్