E-Paper
Advertisement

వాట్సప్‌లో బ్లాక్ చేశారని డౌటా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో.. ఈజీగా కనిపెట్టేయండి!

వాట్సప్‌లో బ్లాక్ చేశారని డౌటా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో.. ఈజీగా కనిపెట్టేయండి!
Advertisement

WhatsApp Block: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో వాట్సాప్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులతో కనెక్ట్ అవ్వడానికి ఇది వారధిగా నిలుస్తోంది. అయితే ఒక్కోసారి మనకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు హఠాత్తుగా రిప్లై ఇవ్వడం మానేస్తుంటారు. దాంతో వారు మనల్ని బ్లాక్ చేశారా అన్న అనుమానం సహజంగానే అందరికీ కలుగుతుంది. మరి వారికి మెసేజ్ పంపకుండానే, వారు మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో ఎలా తెలుసుకోవాలో ఈ కథనంలో చూద్దాం.

ప్రొఫైల్ పిక్చర్ మాయం

మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసినప్పుడు సాధారణంగా కనిపించే మొదటి మార్పు ఇదే. సదరు వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్ మీకు కనిపించదు. కేవలం ఖాళీ గ్రే కలర్ ఐకాన్ మాత్రమే దర్శనమిస్తుంది. అయితే వారు తమ ప్రొఫైల్ పిక్చర్‌ను డిలీట్ చేసినా లేదా వారి ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకున్నా కూడా ఇలాగే జరుగుతుంది. కాబట్టి దీని ఆధారంగానే బ్లాక్ చేశారని వంద శాతం చెప్పలేం.

లాస్ట్ సీన్, స్టేటస్ హైడ్

Advertisement

ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే వారి ‘లాస్ట్ సీన్’ లేదా ‘ఆన్‌లైన్’ స్టేటస్ కనిపించదు. వారు వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ ఎలాంటి సిగ్నల్స్ ను వాట్సప్ ఇవ్వదు.

వాట్సాప్ స్టేటస్‌ మాయం

బ్లాక్ చేసిన సందర్భాల్లో సదరు వ్యక్తి ప్రతిరోజూ పెట్టే వాట్సాప్ స్టేటస్‌లు కనిపించడం ఆగిపోతాయి. ఇతర స్నేహితులకు వారి స్టేటస్ కనిపిస్తూ మీకు మాత్రం కనిపించకపోతే మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Also Read: మెుబైల్ డేటా vs వై-ఫై.. బ్యాటరీ దొంగ దొరికాడు.. ఫ్యూజులు ఎగరడం పక్కా!

గ్రూప్ లో యాడ్ కాకపోవడం

పైన పేర్కొన్నవి అన్నీ ప్రైవసీ సెట్టింగ్స్ వల్ల కూడా జరగొచ్చు. కానీ వారు మిమ్మల్ని బ్లాక్ చేశారని కచ్చితంగా తెలుసుకోవడానికి ఈ స్టెప్ కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక కొత్త వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి అందులోకి సదరు వ్యక్తిని యాడ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మిమ్మల్ని వారు బ్లాక్ చేసి ఉంటే వెంటనే ఎర్రర్ మెసేజ్ వస్తుంది.

Also Read: నిప్పులకుంపటిలా ఆకాశం.. ఫ్రాన్స్‌ను చుట్టేసిన ‘ఓమేగా బ్లాక్’.. 40 మంది మృతి

Related News

పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు బెస్ట్..రూ.18 వేలలోపు అదిరిపోయే లెనోవా స్మార్ట్ ట్యాబ్!

రూ.1,100లోపే అదిరిపోయే స్మార్ట్‌వాచ్ డీల్..వెంటనే కొనేయండి

ఇండియాలో.. పోవా ఏఐ బడ్స్ ప్రో లాంచ్ డేట్ ఫిక్స్! ఫీచర్స్ మాములుగా లేవుగా..

మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవుతారు!

జియో బిగ్ ఆఫర్.. కొత్తగా రూ.550, రూ.2000 ప్లాన్లు.. ఫ్రీగా 15 ఓటీటీలు, 1000+ ఛానెళ్లు!

జస్ట్ రూ.2,000కే 4G ఫోన్లా? UPI, టైప్-సి ఛార్జింగ్‌తో లభించే టాప్ 5 ఆప్షన్లు ఇవే!

వర్షాకాలంలో ఫ్రిజ్ టెంపరేచర్ ఎంత ఉండాలి ? కరెంట్ ఆదా చేసే టిప్స్!

ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? అయితే ఈ 5 సీక్రెట్ ట్రిక్స్ మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి!

Big Stories

Advertisement
×