E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇదే ట్విస్ట్..

Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇదే ట్విస్ట్..
Advertisement

Gundeninda Gudigantalu Meena : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ రోజు రోజుకి జనాల నుంచి మంచి రెస్పాన్స్ని అందుకుంటూ మంచి టిఆర్పి రేటింగ్ ని అందుకుంటూ దూసుకుపోతుంది. ఈమధ్య ఎక్కడో ఉన్న సీరియలు స్టోరీలు అనేక ట్విస్టులు చోటు చేసుకోవడంతో సెకండ్ ప్లేస్ లోకి రావడం విశేషం. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న మీనా గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా మీనా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మీనా ఇకముందు తెలుగు సీరియల్స్లలో నటించదు అని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. అసలు మీనా ఎందుకు తెలుగు సీరియల్స్ కి గుడ్ బై చెప్పబోతుంది అన్నది ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

తెలుగు సీరియల్స్ కు మీనా గుడ్ బై..

స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లోని హీరోయిన్ మీనా ఇకముందు తెలుగు సీరియల్స్ లో కనిపించదు అంటూ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. గతంలో మీనా గురించి ఇలానే అనేకసార్లు వార్తలు వినిపించాయి. అయితే కేవలం అవి పుకార్లు మాత్రమే అని అర్థమైంది. అయితే ఇప్పుడు మరోసారి మీనా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఓ వార్త వినిపిస్తుంది. నిజానికి మీనా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్.. ఈమె తెలుగులో గతంలో కార్తీకదీపం సీరియల్ లో నటించింది. ఇప్పుడు హీరోయిన్గా గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో నటిస్తుంది. కన్నడలో పలు సీరియస్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు తెలుగులో కూడా ఒక్క సీరియల్ తో అంతకుమించి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు తో పాటుగా కన్నడ సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా కన్నడ సీరియల్ గురించి ఒక పోస్టర్ని షేర్ చేస్తుంది. ఆ పోస్టర్ కాస్త ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవ్వడంతో.. ఈ అమ్మడు ఇకమీదట తెలుగు సీరియల్స్లలో నటించదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీనా అలియాస్ అమూల్య గౌడ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Advertisement

Also Read :Podarillu Today Episode : మహా కోసం చక్రీ గిఫ్ట్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మహా.. హమ్మయ్య.. చక్రీ కోరిక తీరిందా..?

అమూల్య గౌడ కు తెలుగులో రెమ్యూనరేషన్..? 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ అమూల్య గౌడ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సీరియల్ లో చూడడానికి 16 అణాల తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుంది. ఈమె అచ్చం చీర కట్టిన బాపు బొమ్మ లాగా కనిపిస్తుంది. నిజానికి మీనా సింప్లిసిటీ చూసే ఎక్కువ మంది ఈ సీరియల్ ని చూస్తున్నారు అని అర్థమవుతుంది. సీరియల్ లో మీనా ఎంత పద్ధతిగా ఉంటుందో బయట మాత్రం గ్లామర్ డోస్ పెంచుతూ లేటెస్ట్ హాట్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. సీరియల్స్లలో చూసిన ఈమెను సోషల్ మీడియాలో చూస్తే అందరూ ఆమె ఈమెనా అని అనుమానం పడుతుంటారు. అయితే తెలుగు సీరియల్స్ ద్వారా మంచి క్రేజీని సంపాదించుకున్న మేన ఒక రోజుకి దాదాపు 50 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కను చూస్తే ఈమె తెలుగులో ప్రస్తుతం రెండు సీరియల్స్ అలాగే కన్నడ సీరియల్స్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.. అంటే ఈమె నెలకి లక్షల్లోనే సంపాదిస్తూ వస్తుంది.. సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది. ఏది ఏమైనా కూడా మీనా రెండు చేతుల సంపాదిస్తూ ఆస్తులను కూడబెడుతూ వస్తుంది..

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×