NBK112 Movie:బాలయ్య ..మాస్ హీరో ,కొరటాల మాస్ డైరెక్టర్.ఇక వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.NBK112గా తెరకెక్కబోతున్న ఈ సినిమా అనౌన్స్ అయినప్పటినుండి థియేటర్ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా ముహూర్తం మొన్నటి జూన్ లో అమరావతిలో ఘనంగా ప్రారంభమైంది కూడా.
అయితే సినిమా ఇలా మొదలైందో లేదో బాలయ్య మోకాలి సర్జరీ జరగడంతో అసలు సినిమా ఉంటుందా లేదా అంటూ పుకార్లు తెగ షికార్లు చేశాయి.అయితే సినిమా అసలు ఆగిపోలేదంటూ మేకర్స్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చారు కూడా.ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమా దర్శకత్వంలో వస్తున్న దాదా సినిమా పూర్తియ్యాక ఈ సినిమా ఉంటుందని తేల్చేసింది.
షూటింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం బాలయ్య కొరటాల కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఒక భారీ సిద్దం చేస్తున్నారట మేకర్స్. అవును …ఒక క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సెట్లోనే బాలయ్య ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది.పైగా ఈ షూటింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే మొదలవుతుందన్న టాక్ వినిపిస్తుంది.
పొలిటికల్ టచ్ తో పాటు ప్యామిలీ ఎమోషన్స్
ఇక తన సినిమాలలో కమర్షియల్ వాల్యూస్ తో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ కి పెద్ద పీట వేసే కొరటాల ఈ సినిమాలో కూడా పొలిటికల్ టచ్ తో పాటు ప్యామిలీ ఎమోషన్స్ కూడా గట్టిగా దట్టించబోతున్నాడని తెలుస్తుంది.పైగా ఎప్పుడు చూడని విధంగా ఒక సరికొత్త మేకోవర్ లో బాలయ్య దర్శనమివ్వబోతున్నాడని ఇన్ సైడ్ టాక్.
66 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోల కళ్ళు కుట్టేలా
బాలయ్య సినిమాల విషయానికి వస్తే వీర సింహరెడ్డి, డాకు మహారాజ ,భగవంత్ కేసరి,అఖండ 2 వంటి సినిమాలతో మాంచి జోష్ లో ఉన్న బాలయ్య ఇపుడు కెరీర్ లో మరిన్ని సినిమాలని సెట్స్ మీద పెట్టేస్తున్నాడు.ఈ క్రమంలోనే గోపి చంద్ మలినేనితో దాదాని పట్టాలెక్కించిన బాలయ్య కొరటాలతో పాటు ఇద్దరు మరో దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.ఏది ఏమైనా 66 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోల కళ్ళు కుట్టేలా సినిమాలని లైనప్ చేయడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.
ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో
ఇక మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను అంటూ వరుస సక్సెస్ లు చూసిన శివ కొరటాల ఆచార్య సినిమాతో అడ్డంగా బుక్ అయినప్పటికీ తిరిగి దేవర సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు .అయితే కారణం తెలీదు కాని దేవర 2 ఉంటుందని ఊదరగొట్టిన మేకర్స్ దాని పై ఫోకస్ పెట్టకపోవడంతో ఇలా బాలయ్య వైపు టర్న్ అయ్యాడు.
ALSO READ:వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు
ఇక ఈ సినిమాకి కార్పెంటర్ అన్న టైటిల్ పెడతారన్న టాక్ కూడా వినిపిస్తుంది.చూడాలి మరి భారీ అంచనాలతో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి !