E-Paper
Advertisement

ఫ్యాటీ లివర్‌ బాధితులకు ఆ రెండు పండ్లతో చెక్.. అధ్యయనంలో ఏం తేలిందంటే

ఫ్యాటీ లివర్‌ బాధితులకు ఆ రెండు పండ్లతో చెక్.. అధ్యయనంలో ఏం తేలిందంటే
Advertisement

ప్రస్తుతం ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా మద్యం తాగని వారిలో కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుతోంది. దీంతో చాలామంది సహజసిద్ధమైన ఆహారాల ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచాలని ప్రయత్నిస్తుంటారు.

ఇటీవలే ఫ్యాటీ లివర్‌పై జరిగిన ఒక అధ్యయనం గురించి అడ్వాన్సెస్ ఇన్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ జర్నల్ ప్రచురితమైంది. ఈ అధ్యయనం ప్రకారం ఉసిరి, నేరేడు వంటి పండ్లు కాలేయానికి మేలు చేస్తాయి. ఈ పరిశోధనల్లో తేలిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ రెండు పండ్లు కాలేయ ఆరోగ్యానికి కొంతమేర ఉపయోగపడతాయి. అయితే ఇవి ఒక్కటే ఫ్యాటీ లివర్‌ను పూర్తిగా నయం చేయలేవని నిపుణులు చెబుతున్నారు.

గ్రేడ్ – 1 ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి?

Advertisement

గ్రేడ్ -1 ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రారంభ దశ. శరీరం కొవ్వులు, చక్కెరలను సరిగా ప్రాసెస్ చేయలేకపోతే ఈ సమస్య వస్తుంది. ఈ దశలోనే జీవనశైలిలో మార్పులు చేస్తే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం.

ఉసిరి కాలేయాన్ని ఎలా కాపాడుతుంది?

ఉసిరికి ఆయుర్వేదంలోనే కాకుండా అడ్వాన్స్ న్యూట్రిషన్ సైన్స్‌లో కూడా ఎంతో ప్రాధాన్యం పొందింది. ఇందులో విటమిన్ C, పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు కాలేయ కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అలాగే కాలేయంలో ఏర్పడే వాపును తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొవ్వు జీవక్రియ మెరుగుపడి కాలేయం తన పనిని మరింత సమర్థంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.

నేరేడు వల్ల కలిగే ప్రయోజనాలు

Advertisement

నేరేడు పండ్లు ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా చాలా మందికి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. రక్తంలో అధికంగా ఉండే చక్కెర కాలేయంలో కొవ్వుగా నిల్వ అవుతుంది.

నేరేడు పండ్లకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కాలేయానికి సంబంధించిన ఎఎల్‌టి, ఎఎస్‌టి, ఎంజైమ్ స్థాయిలను కూడా తగ్గించడంలో ఇవి ఉపయోగపడవచ్చు.

ఉసిరి, నేరేడు కలిపి తీసుకుంటే మంచిది

ఉసిరి, నేరేడు రెండింటిలోనూ వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరి కాలేయ కణాలను రక్షిస్తే, నేరేడు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందువల్ల ఈ రెండు పండ్లలో ఏది మంచిదని పోల్చడం కంటే, సమతుల్య ఆహారంలో భాగంగా రెండింటినీ తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎలా తీసుకోవాలి?

రోజూ 5 నుంచి 7 నేరేడు పండ్లు తినవచ్చు. అలాగే ఒక చిన్న గ్లాస్ పలుచగా కలిపిన తాజా ఉసిరి రసాన్ని తీసుకోవచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం వీటిని తీసుకోవడం మంచిది. ఉసిరి రసంలో అదనంగా చక్కెర కలపకుండా తీసుకోవాలి.

జీవనశైలిలో మార్పులు కూడా అవసరం

ఉసిరి, నేరేడు మాత్రమే ఫ్యాటీ లివర్‌ను తగ్గించలేవు. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉన్న ప్రోటీన్లు ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు, ప్రాసెస్డ్ ఆహారం, అధిక కొవ్వు పదార్థాలను తగ్గించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, బరువు నియంత్రించడం, తగినంత నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం.

Also Read: మీ కుటుంబంలో అందరికీ షుగర్ ఉందా? మీ పిల్లలకు మధుమేహం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి

వైద్యుల సలహా తప్పనిసరి

మీకు గ్రేడ్ -1 ఫ్యాటీ లివర్ ఉందని నిర్ధారణ అయితే వైద్యులను క్రమం తప్పకుండా సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ వారి సూచనలు పాటిస్తే మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

గమనిక: ఉసిరి, నేరేడు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడే ఆహారాలు మాత్రమే. సరైన వైద్య చికిత్స, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి కలిసి ఉన్నప్పుడే ఫ్యాటీ లివర్‌ను సమర్థంగా నియంత్రించవచ్చు.

Related News

గంధపు చెట్ల మీదే పాములు ఎందుకు ఎక్కువగా నివసిస్తాయి? సువాసన కాదు.. అసలు కారణం ఇది

వర్షాకాలంలో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య తీవ్రం.. ఇంట్లోనే ఈ డ్రింక్స్‌తో ఉపశమనం

చిన్నప్పుడు ఈ 5 అలవాట్లు ఉన్న పిల్లల్లు తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారిని పట్టించుకోరు

బరువు తగ్గాలంటే ఆకలితో ఉండాల్సిన పనిలేదు.. ఈ 4 పనులు చేయండి చాలు!

అన్న వద్ద డబ్బు గుంజడమే పని.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సోదరుల చేత ఖర్చు చేయించడంలో దిట్ట

ప్రతి రోజు మేకప్ తొలగించడానికి ఇబ్బందిపడుతున్నారా? నిమిషాల్లో మీ పని పూర్తి చేసే నేచురల్ క్లీన్సింగ్ బామ్ ఇలా చేసుకోండి

పిల్లలు తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతారు.. డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

స్వైన్ ఫ్లూ వస్తే పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×