Pova AI Buds Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో.. తమ సబ్‌బ్రాండ్ Pova ద్వారా భారత్‌లో అత్యంత ఆధునిక ఏఐ (AI) ఫీచర్లతో Pova AI Buds Pro పేరుతో సరికొత్త TWS ఇయర్ బడ్స్‌ను విడుదల చేసింది. సాధారణంగా ఖరీదైన, ప్రీమియం ఇయర్ బడ్స్‌లో మాత్రమే కనిపించే ఎన్నో హైఎండ్ ఫీచర్లను ఇందులో పరిచయం చేశారు.
ఈ Pova AI Buds Pro అసలు ధర రూ.14,999 కాగా.. ప్రారంభ ఆఫర్ కింద రూ.12,499కే సొంతం చేసుకోవచ్చు. దీనికి అదనంగా రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ బడ్స్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
Pova AI Buds Pro బడ్స్‌లో అత్యంత ముఖ్యమైనది ఏఐ పవర్డ్ రికార్డింగ్ ఫీచర్. ఛార్జింగ్ కేస్‌పై ప్రత్యేకంగా ఇచ్చే రెడ్ కలర్ ‘క్విక్ నోట్’ బటన్ నొక్కడం ద్వారా ఫోన్‌తో పనిలేకుండానే నేరుగా 4 గంటల వరకు ఆడియోను రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ అయిన మాటలను ఉచితంగా టెక్స్ట్‌గా మార్చడంతో పాటు, సుదీర్ఘంగా జరిగిన మీటింగ్స్‌ను ఏఐ ద్వారా క్లుప్తంగా సమరైజ్ చేసి ఇస్తుంది. ఆఫీస్ మీటింగ్స్ తరచూ అటెండ్ అయ్యే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also Read: ఆగస్టు 15 స్పెషల్.. BSNL రూ.2,399 ప్లాన్‌పై అదనపు వాలిడిటీ.. ఆఫర్ కొద్దిరోజులే!
ఈ బడ్స్‌లోని మరో ఆసక్తికరమైన ఫీచర్ ఏమిటంటే.. ఏకంగా 78 భాషల్లో లైవ్ ఆడియోను రికార్డ్ చేసి రియల్‌టైమ్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తుంది. ఇతర భాషలు మాట్లాడే వారితో మాట్లాడేటప్పుడు ఇది అద్భుతంగా పనికొస్తుంది. అలాగే ఈ డేటా అంతా వినియోగదారుల నియంత్రణలోనే ఉంటుందని, ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని కంపెనీ స్పష్టం చేసింది.
స్పష్టమైన ఆడియో, స్పష్టమైన కాల్స్ కోసం Pova AI Buds Proలో 8 మైక్రోఫోన్లు, 48dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఇచ్చారు. ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 40 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
Pova AI Buds Proలో టైప్-సి ఛార్జింగ్‌తో పాటు క్యూఐ (Qi) వైర్‌లెస్ ఛార్జింగ్, IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. మొత్తానికి పవర్‌ఫుల్ ఏఎన్‌సీ, మీటింగ్ రికార్డింగ్స్, ట్రాన్స్‌లేషన్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ పోవా AI బడ్స్ ప్రో, ఇండియన్ ఇయర్ బడ్స్ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాయి.
Also Read: సినిమా హాల్ రేంజ్ సౌండ్.. బోట్ కొత్త సౌండ్‌బార్లు వచ్చేశాయ్, ఫీచర్లు, ధరలు ఇవే!