Krishnudu Daughter: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కృష్ణుడు(Krishnudu) ఒకరు. కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్న ఈయన అనంతరం వినాయకుడు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. విలేజ్ లో వినాయకుడు, ప్యార్ మే పడిపోయానే వంటి సినిమాలలో నటించిన ఈయన ఉన్న ఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కృష్ణుడు ఇటీవల బిగ్ బాస్ 10(Bigg Boss 10)రియాలిటీ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న కృష్ణుడు రెండవ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు.
ఇలా ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత వరుసగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ముద్దుల కూతురితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. దీంతో కృష్ణుడి కూతురి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ విధంగా తన కుమార్తెతో కలిసి దిగిన ఫోటోని కృష్ణుడు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ..
తన ముద్దుల కుమార్తె నిత్యతో కలిసి ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నానని, మనం కలిసి గడిపే ప్రతిక్షణం కోసం చాలా కృతజ్ఞతతో కలిగినది.. నా హృదయం సంతోషంతో నిండిపోయింది అంటూ ఈయన తన కూతురితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు అయితే ఇలా మొదటిసారి తన కూతురి ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కృష్ణుడి కుమార్తె నిత్య ఫోటో చూసిన అభిమానులు మాత్రం అమ్మాయి ఎంతో చూడముచ్చటగా ఉందని కామెంట్ చేయగా,మరి కొంతమంది హీరోయిన్ మెటీరియల్ అని, సినిమాలలోకి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక కృష్ణుడి విషయానికి వస్తే.. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన బిగ్ బాస్ ద్వారా మరోసారి వెలుగులోకి వచ్చారు. మరి బిగ్ బాస్ ద్వారా ఈయన ఏదైనా సినిమాలలో అవకాశాలు అందుకొని తిరిగి వెండితెరపై సందడి చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎంతో కాన్ఫిడెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పటికీ ఈయన మాత్రం ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయారు. తనకు స్వీట్స్ అంటే ఇష్టం అని స్వీట్స్ మానేయడం వల్ల తన ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం చూపడంతోనే హౌస్ నుంచి బయటకు వచ్చానని కృష్ణుడు తన ఎలిమినేషన్ గురించి తెలియజేశారు. మరి బిగ్ బాస్ తర్వాత ఈయనకు వెండితెరపై అవకాశాలు వస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ‘ రాకా’ విషయంలో కీలక మార్పులు.. రెండు భాగాలుగా రాబోతోందా?