E-Paper
Advertisement

దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఇదే.. చిన్నది ఎక్కడుందో తెలుసా?

దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఇదే.. చిన్నది ఎక్కడుందో తెలుసా?
Advertisement

India’s Railway Platform Records: ఒక రైల్వే ప్లాట్‌ ఫామ్ ఎంత పొడవు ఉంటుంది? సాధారణంగా ఒక రైలు ఆగడానికి సరిపడేంత స్థలం ఉంటే చాలనుకుంటాం. కానీ, భారతీయ రైల్వేల్లో కొన్ని ప్లాట్‌ ఫామ్‌లు మాత్రం మన ఊహకు అందనంత పొడవుగా ఉంటాయి. మరోవైపు.. కొన్ని స్టేషన్లలో ప్లాట్‌ ఫామ్‌లు చాలా చిన్నగా ఉంటాయి. దేశంలోనే అత్యంత పొడవైన ప్లాట్‌ఫామ్‌తో పాటు అత్యంత చిన్న ప్లాట్‌ఫామ్ కూడా ఉంది. ఇంతకీ అవెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1.5 కిలోమీటర్లకు పైగా పొడవైన ప్లాట్‌ఫామ్

కర్ణాటకలోని శ్రీ సిద్ధారూఢ స్వామిజీ హుబ్బళ్లి జంక్షన్ భారతీయ రైల్వేల్లో ప్రత్యేకమైన రికార్డును కలిగి ఉంది. ఈ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 1 పొడవు 1,507 మీటర్లు. అంటే దాదాపు 1.5 కిలోమీటర్లు. ఒక్కసారి ప్లాట్‌ఫామ్ ఒక చివరి నుంచి మరో చివరి వరకు నడవాలంటేనే చాలా దూరం ప్రయాణించినట్టుగా అనిపిస్తుంది. ఇంత పొడవైన ప్లాట్‌ఫామ్ ఉండటంతో ఒకేసారి పొడవైన రైళ్లను మెయింటెయిన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ప్రపంచ రికార్డులో హుబ్బళ్లి!

Advertisement

హుబ్బళ్లి జంక్షన్ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత కేవలం భారత్ కు మాత్రమే పరిమితం కాలేదు. 1,507 మీటర్ల పొడవుతో ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందింది. అంతకుముందు ఈ రికార్డు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జంక్షన్ పేరిట ఉండేది. గోరఖ్‌పూర్ ప్లాట్‌ఫామ్ పొడవు సుమారు 1,366 మీటర్లు. ఆ రికార్డును హుబ్బళ్లి అధిగమించింది.

మరి చిన్న ప్లాట్‌ ఫామ్ ఎక్కడుంది?

ఒకవైపు కిలోమీటరుకు పైగా పొడవైన ప్లాట్‌ఫామ్ ఉంటే.. మరోవైపు కేవలం కొద్దిదూరంలోనే ముగిసిపోయే ప్లాట్‌ఫామ్ కూడా ఉంది. ఒడిశాలోని బాన్స్‌ పానీ రైల్వే స్టేషన్ దేశంలోని అత్యంత చిన్న రైల్వే ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా ప్రస్తావించబడుతోంది. ఈ ప్లాట్‌ఫామ్ పొడవు కేవలం 142.56 మీటర్లు. అంటే, హుబ్బళ్లి ప్లాట్‌ ఫామ్‌తో పోలిస్తే ఇది చాలా చిన్నది. బాన్స్‌ పానీ స్టేషన్‌లో ఒకే ప్లాట్‌ ఫామ్ ఉన్నది.

రెండు ప్లాట్‌ఫామ్‌ల మధ్య భారీ తేడా

Advertisement

హుబ్బళ్లి ప్లాట్‌ ఫామ్ 1,507 మీటర్లు ఉండగా, బాన్స్‌ పానీ ప్లాట్‌ఫామ్ 142.56 మీటర్లు మాత్రమే. ఒక ప్రాంతంలో భారీ రైళ్ల రాకపోకలకు అనుగుణంగా కిలోమీటరుకు పైగా పొడవైన ప్లాట్‌ఫామ్ అవసరమైతే.. మరో ప్రాంతంలో చిన్న ప్లాట్‌ఫామ్‌తోనే రైల్వే సేవలు కొనసాగుతున్నాయి.

భారతీయ రైల్వేల్లో ఇలాంటి విశేషాలు ఎన్నో..

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌ వర్క్‌ లలో ఒకటి. వేలాది స్టేషన్లు, లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు, భిన్నమైన భౌగోళిక పరిస్థితులతో ఆకట్టుకుంటుంది. అందుకే ప్రతి స్టేషన్‌కు దాని అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేకతలు ఉంటాయి.

Read Also: రైళ్లు కావు.. కదిలే రాజభవనాలు.. భారత్‌ లోని ఈ ట్రైన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

Tags

Related News

రైళ్లు కావు.. కదిలే రాజభవనాలు.. భారత్‌ లోని ఈ ట్రైన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

1979లో దీవిలోకి 30 ముంగిసలు.. కట్ చేస్తే ప్రభుత్వానికే చుక్కలు.. 45 ఏళ్లలో ఊహించని విధ్వంసం!

వాటర్ ఫాల్స్ కాదు బ్లడ్ ఫాల్స్.. రక్తం ప్రవహించే ఈ ప్రదేశం ఎక్కడుందంటే?

టికెట్ల నుంచి రైళ్ల మెయింటెనెన్స్ వరకు.. ఈ స్టేషన్‌లో పనిచేసేది అంతా మహిళలే!

మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?

సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!

పండుగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో రైలు ఎక్కొచ్చు!

Big Stories

Advertisement
×