E-Paper
Advertisement

ఒకే ధరకు రెండు దిగ్గజ ఫోన్లు.. కెమెరా, పనితీరులో ఏది బెటరంటే?

ఒకే ధరకు రెండు దిగ్గజ ఫోన్లు.. కెమెరా, పనితీరులో ఏది బెటరంటే?
Advertisement

iPhone 18 Pro Max vs Samsung S26 Ultra: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్, శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది. తాజాగా విడుదలైన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌.. ఏ20 ప్రో చిప్‌సెట్, వేరియబుల్ అపెర్చర్ కెమెరా, మెరుగైన బ్యాటరీ లైఫ్ వంటి అప్‌డేట్స్‌తో వచ్చింది. అయితే గతేడాది వచ్చిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ ఇప్పటికీ తన పవర్‌తో గట్టి పోటీ ఇస్తోంది.

మరోవైపు యాపిల్ ఎకోసిస్టమ్‌ కంటే ఆండ్రాయిడ్‌ వైపు మొగ్గు చూపే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా కూడా ఆకట్టుకునే ఆప్షన్‌గా నిలుస్తోంది. కెమెరా, పనితీరు, ర్యామ్‌, ఫీచర్ల విషయంలో ఈ రెండు ఫ్లాగ్‌షిప్‌లు తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. మరి దాదాపు ఒకే ధరలో లభించే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, గెలాక్సీ ఎస్26 అల్ట్రాలో ఏది మెరుగైన ఎంపిక? ఈ రెండింటి మధ్య అసలు తేడాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Advertisement

డిజైన్, సైజ్ విషయాల్లో ఈ రెండు ఫోన్లలో పెద్దగా తేడా ఉండదు. రెండింటిలోనూ 12 జీబీ ర్యామ్ ప్రామాణికంగా వస్తుంది. అయితే శాంసంగ్ 16 జీబీ ర్యామ్ వేరియంట్‌ను కూడా ఆఫర్ చేస్తుంటే.. యాపిల్ మాత్రం 2 టీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో దాన్ని భర్తీ చేస్తోంది. ప్రాసెసర్ పరంగా ఐఫోన్‌లో హెక్సాకోర్ ప్రాసెసర్ ఉంటే.. శాంసంగ్‌‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉంది. దీనివల్ల మల్టీ కోర్ పెర్ఫార్మెన్స్‌లో శాంసంగ్, సింగిల్ కోర్ టాస్కుల్లో ఐఫోన్ ముందంజలో ఉంటాయి.

Also Read: నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు.. కానీ ఈ 3 ఫీచర్లు మాత్రం అస్సలు పనిచేయవు!

కెమెరా విషయంలో తేడాలు:

Advertisement

ఇక కెమెరా విషయానికి వస్తే.. శాంసంగ్ ఎస్26 అల్ట్రాలో ఏకంగా 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. కానీ ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో ఫిజికల్ వేరియబుల్ అపెర్చర్ కెమెరాను పరిచయం చేశారు. కాంతిని బట్టి ఓపెన్, క్లోజ్ అయ్యే ఈ కెమెరా సాంకేతికత ఫొటోగ్రఫీ ప్రేమికులను బాగా ఆకట్టుకుంటుంది. ఇవి కాకుండా గేమింగ్, మల్టీటాస్కింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్ల పరంగా రెండూ సమానంగానే రాణిస్తాయి.

ధర ఎంత ఉందంటే?

ఈ రెండు ఫోన్ల ప్రారంభ ధర దాదాపు రూ.1,08,500 వద్ద ఒకేలా ఉంది. ఒకవేళ మీరు టాప్ ఎండ్ పెర్ఫార్మెన్స్ కోరుకుంటే ఈ ధర ఓకే అనిపిస్తుంది. అయితే ఐఫోన్ 17 ప్రో మాక్స్ లేదా సాధారణ ఎస్26 మోడల్స్ కూడా దాదాపు ఇదే రేంజ్ అనుభూతిని కాస్త తక్కువ ధరకే ఇస్తున్నాయి. పైగా పిక్సెల్ 11 ప్రో మోడల్ దాదాపు రూ.16,700 తక్కువ ధరకే దాదాపు ఇలాంటి ఫీచర్లు ఇస్తోంది.

ఏది కొంటే బెటర్?

మొత్తానికి ఈ రెండు ఫోన్ల మధ్య తేడాలు చాలా తక్కువే. ఇప్పుడున్న ఫోన్లతో పోలిస్తే.. ఈ మోడల్స్‌లో వచ్చిన మార్పులు చాలా చిన్నవి. కాబట్టి ఇప్పుడున్న ఫోన్ బాగా పనిచేస్తుంటే.. డబ్బులు వృధా చేయకుండా వచ్చే ఏడాది రాబోయే పెద్ద టెక్నాలజీ అప్‌గ్రేడ్స్ వరకు వేచి చూడటమే మంచి నిర్ణయం.

Also Read: రూ.17,999 ధరకే కేక పుట్టించే 5G టాబ్లెట్.. 8000mAh బ్యాటరీతో Ai+ NovaTab లాంచ్!

Tags

Related News

మీ ఫోన్‌కు వేరే వాళ్ల ఛార్జర్ వాడుతున్నారా? పొరపాటున కూడా ఇలా చేయొద్దు ఎందుకంటే?

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్ళు..ఈ 5 విషయాలు అస్సలు మరవద్దు!

రూ.3,300కే అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్.. 21 రోజుల బ్యాటరీ, 50+ వర్కౌట్ మోడ్స్!

పాత గాడ్జెట్ బాక్సులు ఇంట్లో ఉన్నాయా? అయితే మీకు జాక్‌పాట్ తగిలినట్టే!

మీ ఫేవరెట్ డ్రెస్సులు ఎప్పుడూ కొత్త వాటిలాగే మెరవాలంటే..వాటిపై ఉన్న సింబల్స్ మిస్టరీ తెలియాల్సిందే!

నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు.. కానీ ఈ 3 ఫీచర్లు మాత్రం అస్సలు పనిచేయవు!

పవర్ కట్ అయినప్పుడు ఫ్రిజ్‌లో.. ఏ పదార్థాలు ఎన్ని గంటలు తాజాగా ఉంటాయో తెలుసా?

Big Stories

Advertisement
×