E-Paper
Advertisement

చిరంజీవితో బుచ్చిబాబు.. కాంబో ఫిక్స్ అయిపోయిందా?

చిరంజీవితో బుచ్చిబాబు.. కాంబో ఫిక్స్ అయిపోయిందా?
Advertisement

Buchi Babu with chiru:బుచ్చిబాబు సాన.. చేసిన తొలి సినిమాతోనే వందకోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యాడు ఈ కుర్ర డైరెక్టర్ .ఇక ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీతోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది అంటూ మరో సినిమాని పట్టాలెక్కించాడు.
ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ,రూరల్ మాస్ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడు జూన్ 4 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా జాన్వికపూర్ నటించగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు,జగపతిబాబు, బొమ్మన్ ఇరాని ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ఇప్పుడు ఒక బేతాళ ప్రశ్న

అయితే పెద్ది సినిమా తర్వాత బుచ్చిబాబు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు ఒక బేతాళ ప్రశ్న అయిపోయింది.అయితే ఇండస్ట్రీలో పెద్ది తర్వాత బుచ్చిబాబు మహేష్ బాబుతో చేయబోతున్నాడు అన్న వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి కానీ బుచ్చి ఈ సినిమాపై ఎక్కడా పెదవి విప్పలేదుబుచ్చిబాబు.

Advertisement

దీంతో బుచ్చిబాబు మౌనం అర్ధాంగీకారం కాబోలు అంటూ మహేష్ తో సినిమా ఉండొచ్చేమో అన్న టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది.ఇక ఇదిలా ఉండగానే అబ్బే మహేష్ బాబు కాదు బుచ్చి బాబు డైరెక్ట్ చేయబోయేది మెగాస్టార్ చిరంజీవినే అని మరోవార్త ఇపుడు హైలెట్ అవుతుంది.

చిరు ఫుల్ బిజీ

అయితే ఈ కాంబినేషన్ పై అటు మెగా కాంపౌండ్ నుంచి కానీ ,ఇటు బుచ్చిబాబు నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు చిరు లైనప్ చూసుకుంటే బిజీగా కనిపిస్తుంది .బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది .వీళ్లిద్దరి కాంబోలో గతంలో వాల్తేరు వీరయ్య అనే సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత చిరు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించబోతున్నాడని సమాచారం ఇలా వరుస కమిట్మెంట్స్ పెట్టుకొని బుచ్చిబాబుకి చిరంజీవి డేట్స్ ఇస్తాడా అంటే అనుమానమే చూడాలి మరి ..అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా సాగుతున్న ఈ గాసిప్పుల పరంపరకి వీరిలో ఎవరు ఎండ్ కార్డు వేస్తారో.

చిరుతో జత కడతాడా, లేక మహేష్ తో సినిమా చేస్తాడా

ఇక బుచ్చిబాబు విషయానికి వస్తే ఉప్పెన వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్లకు గాని పెద్దిని పట్టాలెక్కించలేకపోయాడు .అయితే రామ్ చరణ్ లాంటి స్టార్ ని డీల్ చేసిన విధానం చాలామందికి నచ్చేసింది.దీంతో బుచ్చిబాబుతో టాప్ లీగ్ హీరోలు నటించాలని ఆసక్తి చూపుతున్నారన్న వార్త కూడా వినిపిస్తుంది.

also read:వెంకీ మామ చేతికి మళ్లీ గన్.. ఈసారి ఆర్మీ ఆఫీసర్‌గా!

ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసిలో బిజీగా ఉన్నాడు .ఈ సినిమా వచ్చే ఏడు ఏప్రిల్ 7న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే .చూడాలి మరి బుచ్చిబాబు అటు చిరుతో జత కడతాడా, లేక మహేష్ తో సినిమా చేస్తాడా అనేది కాలమే డిసైడ్ చేయాలి!

Tags

Related News

అంజలికి పెళ్లి ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్

నాగ్ అశ్విన్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

ఆ క్షణం ఒంటరిని అనిపించింది..ఎమోషనల్ అయిన తారక్!

అవార్డు వేడుకకు పింక్ చీరలో వచ్చిన నిహారిక.. వెనుక అసలు కథ ఇదే!

అదే నడక.. అదే స్వాగ్.. యమదొంగను గుర్తు చేసిన తారక్!

సినిమా మీద సినిమా.. ఫలితం మాత్రం అదే! కయాదు కష్టాలు కంటిన్యూ

డ్రాగన్ కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ సినిమా పై జక్కన్న కామెంట్స్!

‘ఏష నాగుల కట్ట’ పాటతో ఫేమస్.. జంగి రెడ్డి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×