E-Paper
Advertisement

వెంకీ మామ చేతికి మళ్లీ గన్.. ఈసారి ఆర్మీ ఆఫీసర్‌గా!

వెంకీ మామ చేతికి మళ్లీ గన్.. ఈసారి ఆర్మీ ఆఫీసర్‌గా!
Advertisement

Venkatesh Anil:అనిల్ రావిపూడి.. ఇప్పటి తరానికి ఈయనొక జంధ్యాల .అవును మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు వరుసగా చేసిన తొమ్మిది సినిమాలు కామెడీని బేస్ చేసుకుని సూపర్ డూపర్ హిట్ అయినవే మరి.అలాంటి డైరెక్టర్ ఇపుడు మరోసారి వెంకీ మామతో జోడీ కడుతున్నాడు అన్న వార్త బయటకి రావడంతో మాకు మరోసారి నవ్వుల విందు పక్కా అని ఫిక్స్ అయిపోయారు మూవీ లవర్స్.

ఇక ఈ డైరెక్టర్ కి విక్టరీ వెంకటేష్ కి మధ్య ఎంత బాండింగ్ ఉందో చెప్పక్కర్లేదు.వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ఎఫ్2 ,ఎఫ్3 ,సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. ఇక మన శంకర్ ప్రసాద్ గారు సినిమాలో వెంకీ మామ ఇచ్చిన గెస్ట్ అప్పీరియన్స్ ని మనం ఇప్పటికీ మర్చిపోలేము.

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి

Advertisement

ఇక తాజాగా వెంకీ మామ,కళ్యాణ్ రామ్ కాంబోలో పదో సినిమాని పట్టాలెక్కించిన అనిల్ రావిపూడి తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని వదిలాడు .
ఈ సినిమాలో వెంకీ మామ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఇక పోస్టర్ చూస్తే వెంకీ మామను పూర్తిగా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి.

ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమా

ముఖ్యంగా వెంకీ మామ ఆర్మీ యూనిఫామ్ ,బ్లాక్ బూట్స్ ,సన్ గ్లాసెస్ తో, బ్లాక్ కలర్ వాగన్ పై కాలు పెట్టి ఇచ్చిన సీరియస్ లుక్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.
ఇక బ్యాగ్రౌండ్ లో హెలికాప్టర్లు,దుమ్ము,నిప్పురవ్వలు వంటివి చూస్తుంటే అనిల్ రావిపూడి ఈసారి కాస్త యాక్షన్ సీక్వెన్స్ గట్టిగానే దట్టించినట్టు కనిపిస్తున్నాడు.
ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి సినిమాలు చూస్తే సుప్రీం,రాజా ది గ్రేట్ ,సరి లేరు నీకెవ్వరు,సంక్రాంతికి వస్తున్నాము, మన శంకర్ వరప్రసాద్ వంటి సినిమాలు కామెడీతో వచ్చి సూపర్ హిట్ అయినవే .మరి ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనిల్ రావిపూడి ఈసారి ఎంత మేరకు ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేస్తాడో చూడాలి .
ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్ మరియు జెడ్ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు జీవి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

వెంకీ మామతో ఎలాంటి కామెడీ పండిస్తాడో

Advertisement

చూడాలి మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా, మన శంకర్ ప్రసాద్ గారు లో సెక్యూరిటీ ఆఫీసర్ గా హీరోలని చూపించిన అనిల్ రావిపూడి ఈసారి ఆర్మీ ఆఫీసర్ గా వెంకీ మామతో ఎలాంటి కామెడీ పండిస్తాడో.

also read:రాజు వెడ్స్ రాంబాయి భామ… పలుచని చీరలో అదరగొట్టేసిందిగా !

ఇక ఇదివరకే ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలుపుతున్నామని చెప్పేసింది మూవీ టీం.సినిమా పేరు జనవరి 13న విడుదల అన్నట్టు కూడా వినిపిస్తుంది. నిజ నిజాలు ఏంటో మేకర్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తే గాని తెలియదు.

Tags

Related News

చిరంజీవితో బుచ్చిబాబు.. కాంబో ఫిక్స్ అయిపోయిందా?

రాజు వెడ్స్ రాంబాయి భామ… పలుచని చీరలో అదరగొట్టేసిందిగా !

కాలిఫోర్నియా అందాల మధ్య మమతా మోహన్‌దాస్.. ఫొటోలు అదుర్స్!

శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. పోతురాజు గెటప్‌లో మేఘాంశ్.. వెనుక తండ్రి!

తమన్ గొప్ప నిర్ణయం.. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ఏకంగా 12 కోట్లు!

‘జార్జ్ క్రిష్’ శ్రీను వైట్ల జాతకం మారుస్తాడా ?

నేను హనుమంతుడి కుమార్తెని …. అనసూయ కామెంట్స్ వైరల్ !

Big Stories

Advertisement
×