E-Paper
Advertisement

కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి గుడ్‌బై చెప్తారా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి గుడ్‌బై చెప్తారా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!
Advertisement

Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి రాజకీయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఓవైపు రాహుల్ గాంధీ వెంటే ఉంటానని, పార్టీని వీడేది లేదని చెబుతూనే, మరోవైపు ప్రభుత్వ తీరుపై, పదవుల కేటాయింపులపై ఆయన చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

కాంగ్రెస్‌లో కలకలం..

ఉద్యమనేతలు, సీనియర్లను విస్మరించి, వలసొచ్చిన నేతలకే పార్టీలో పట్టం కడుతున్నారన్న ఆయన ఆరోపణలో సొంత గూటిలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం కనిపిస్తోంది. ముఖ్యంగా, తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తే ఈ విమర్శలకు ఆజ్యం పోస్తోందన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇక తమిళనాడు తరహాలో కొత్త రాజకీయ పరిణామాలు తీసుకువస్తా అంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. సొంత ప్రభుత్వంలోనే ప్రజాధనం దుర్వినియోగం అవుతోందంటూ ఎమ్మెల్యే హోదాలో ఆయన చేసిన కామెంట్స్ విపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి.

Advertisement

Also Read: మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

పీసీసీ చీఫ్‌ ఫైర్..

కోమటిరెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఇటు పార్టీ లైన్ దాటే వారిపై హైకమాండ్‌ కూడా సీరియస్‌గా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఓవైపు బీజేపీ నేతలు అంతర్గత వివాదాలను పక్కనపెట్టి కలిసిపోతుంటే.. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి వినిపించే అసంతృప్తి స్వరాలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందా? ఎప్పుడూ ఉండేదే కదా అని లైట్ తీసుకుంటుందా?

Advertisement

Also read: మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ ఫైర్.. కాంగ్రెస్‌కు గండం పొంచి ఉందా?

Tags

Related News

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు!

కింగ్ కోహ్లీ భీకర విధ్వంసం.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడా.!

ఎఫ్‌బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై రూ. 8 కోట్ల రివార్డ్..!

పార్లమెంట్‌లో కీలక పరిణామం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్రం బిగ్ స్కెచ్!

పర్యాటకులకు శుభవార్త.. కైలాసగిరిపై మళ్లీ మోగనున్న టాయ్ ట్రైన్ కూత!

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్‌లో పన్నుల మోత.. క్యూర్ చట్టంలో సంచలన మార్పులు!

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల రగడ.. బీజేపీలో టికెట్ ఆశించే నాయకుల లిస్ట్ ఇదే?

Big Stories

Advertisement
×