E-Paper
Advertisement

టెన్షన్ లేని లైఫ్‌స్టైల్ కోసం యాపిల్ బిగ్ ప్లాన్.. వర్కౌట్ లవర్స్‌కి ది బెస్ట్ ఆప్షన్!

టెన్షన్ లేని లైఫ్‌స్టైల్ కోసం యాపిల్ బిగ్ ప్లాన్.. వర్కౌట్ లవర్స్‌కి ది బెస్ట్ ఆప్షన్!
Advertisement

Apple Fitness Band: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తమ వేరబుల్స్ విభాగంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా డిస్‌ప్లే లేని ఫిట్‌నెస్ బ్యాండ్‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ప్రముఖ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ కథనం ప్రకారం.. యాపిల్ తమ రాబోయే ఉత్పత్తుల కోసం పలు రకాల కొత్త ఆలోచనలను పరిశీలిస్తోంది.

డిస్‌ప్లే లేని కొత్త రకం బ్యాండ్:

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైపోవడంతో నోటిఫికేషన్ల బెడద లేకుండా, కేవలం ఆరోగ్యంపై మాత్రమే దృష్టి పెట్టాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే యాపిల్ స్క్రీన్ లేని ఫిట్‌నెస్ బ్యాండ్ల వైపు మొగ్గు చూపుతోంది. ఇది పూర్తిగా హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం మాత్రమే పనిచేస్తుంది. రోజువారీ డిస్‌ప్లేల శోధన నుంచి ఉపశమనం కోరుకునే వారికి ఇది చక్కటి ప్రత్యామ్నాయంగా మారనుంది.

Advertisement

Also Read: టెన్సర్ జీ6 ప్రాసెసర్‌తో Pixel 11 Pro XL.. ఊహించని షాక్ ఇచ్చిన గీక్‌బెంచ్ స్కోర్లు!

రౌండ్ డయల్, డిజైన్ల ప్రయోగాలు:

కేవలం స్క్రీన్ లేని బ్యాండ్లు మాత్రమే కాకుండా.. వివిధ సైజులు, రకాల డిస్ప్లేలతో కూడిన వాచ్‌లపై కూడా సంస్థ ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రౌండ్ డిజైన్ కలిగిన యాపిల్ వాచ్‌ను కూడా పరిశీలించారు, కానీ ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. వినియోగదారుల కోరికలకు అనుగుణంగా లుక్స్ విషయంలో కూడా మార్పులు చేయడానికి డిజైన్ టీమ్ పనిచేస్తోంది.

అన్ని వర్గాలకూ అందుబాటులోకి:

Advertisement

సాధారణ వినియోగదారుల నుంచి ప్రీమియం లవర్స్ వరకు అందరినీ ఆకట్టుకునేలా ధరల విషయంలో కొత్త వ్యూహాలను రచిస్తోంది. ప్రస్తుతం ఉన్న మోడళ్ల కంటే తక్కువ ధరకు ఒక వెర్షన్, అలాగే అత్యంత ఖరీదైన మోడల్‌ను కూడా తీసుకురావాలనే ఆలోచనలో ఉంది. దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరిన్ని అత్యాధునిక హెల్త్ ఫీచర్లను తన రాబోయే డివైజ్ లలో పొందుపరచనుంది.

గట్టిపోటీ ఇవ్వడం ఖాయం:

ఇవన్నీ ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉన్నాయని, ఏ మోడల్ మార్కెట్లోకి వస్తుందో ఇంకా స్పష్టత లేదని నిపుణులు చెప్తున్నారు. అయితే, యాపిల్ కనుక స్క్రీన్ లేని బ్యాండ్‌ను అందుబాటులోకి తెస్తే.. వేరబుల్స్ ట్రెండ్ పూర్తిగా మారిపోవడం ఖాయం.

Also Read: Apple Pay వస్తోంది సరే.. మరి UPI పనిచేస్తుందా? ఐఫోన్ యూజర్లు తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఇదే!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×