BigTV English

OTT Movie : డ్యాన్స్ మూవీ లవర్స్ కు ఫీస్ట్ ఈ మలయాళ మూవీ… ఇంకా చూడలేదా ?

OTT Movie : డ్యాన్స్ మూవీ లవర్స్ కు ఫీస్ట్ ఈ మలయాళ మూవీ… ఇంకా చూడలేదా ?
Advertisement

OTT Movie : మలయాళ సినిమాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. జానర్ తో సంబంధం లేకుండా ఈ భాషలో మూవీ వచ్చిందంటే చాలు మిస్ అవ్వకుండా చూస్తారు ఓటిటి మూవీ లవర్స్. అలా మలయాళ మూవీస్ కోసం చెవి కోసుకునే వారి కోసమే తాజాగా ఓ మూవీ ఓటిటిలోకి అడుగు పెట్టి, దుమ్మురేపుతోంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


హాట్ స్టార్ ఒరిజినల్ గా స్ట్రీమింగ్…

ఈ మలయాళ మ్యూజికల్ డ్రామా పేరు ‘మూన్ వాక్’ (Moonwalk). 1980ల నాటి కేరళ గ్రామీణ నేపథ్యంలో బ్రేక్‌డాన్స్, మైఖేల్ జాక్సన్ స్ఫూర్తితో రూపొందిన ఒక ఫీల్-గుడ్ కథ. మైఖేల్ జాక్సన్ డాన్స్, స్టైల్‌తో ప్రేరణ పొందిన యువత జీవితాలను, వారి సవాళ్లను, విజయాలను చూపిస్తుంది. ఈ చిత్రం వినోద్ ఏ.కె. దర్శకత్వంలో, నూతన నటులతో రూపొందింది. ప్రశాంత్ పిళ్ళై సంగీతం ఈ సినిమాకు 80ల నాటి రెట్రో వైబ్‌ను ఇచ్చింది. ఈ సినిమా జియోహాట్‌స్టార్‌ (Jio Hotstar) లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


కథలోకి వెళ్తే…

కథ 1987 లో కేరళలోని తిరువనంతపురం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. జాక్ (అనునాథ్ వీ.పీ.), శిబూ (సిద్ధార్థ్ బాబు), వరుణ్ (రిషి కైనిక్కర), షాజీ (మనోజ్ మోసెస్), సుదీప్ (ప్రేమ్ శంకర్), అరుణ్ (సుజిత్ ప్రభాకర్) కాలేజీ విద్యార్థులు. ప్రీ-డిగ్రీ, డిగ్రీ చదువుతూ, ఒక రోజు స్థానికంగా జరిగిన ఒక డాన్స్ ప్రదర్శనలో “జూమ్ బాయ్స్” అనే గ్రూప్ బ్రేక్‌డాన్స్ చేయడం చూసి, మైఖేల్ జాక్సన్ “మూన్‌వాక్” స్టైల్‌తో స్ఫూర్తి పొందుతారు. ఈ యువకులు వివిధ కులాలు, మతాలు, ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన వారైనప్పటికీ, డాన్స్ పట్ల వారి అభిరుచి వారిని ఒకచోట చేరుస్తుంది. వీళ్ళు అంతా కలిసి “మూన్‌వాకర్స్” అనే సొంత డాన్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తారు.ఈ గ్రూప్ బ్రేక్‌డాన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారికి అనేక ఛాలెంజెస్ ఎదురవుతాయి.

స్థానిక సమాజం, ముఖ్యంగా పోలీసులు, వారి ఫ్రిజ్జీ హెయిర్, డిస్కో-స్టైల్ దుస్తులు, “విచిత్రమైన” డాన్స్‌ను అనుమానంతో చూస్తారు, వారిని గందరగోళం క్రియేట్ చేసే ఆందోళనకారులుగా భావిస్తూ హింసిస్తారు. అది చాలదన్నట్టు జాక్‌తో సహా కొందరు యువకులు తమ కుటుంబాల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఈ “అసాధారణ” డాన్స్‌ను ఒక సీరియస్ కెరీర్ ఆప్షన్‌గా ఒప్పుకోరు. శిబూ (సిద్ధార్థ్ బాబు), సుర (సిబి కుట్టప్పన్) వంటి వాళ్ళు తమ ఆర్థిక సమస్యలు, సామాజిక వివక్షను అధిగమించాల్సి ఉంటుంది. ఏదైతేనేం ఎట్టకేలకు మూన్‌వాకర్స్ ఒక ప్రముఖ డాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొంటారు. మరి ఆ కాంపిటీషన్ లో గెలిచారా? అసలు డ్యాన్స్ రాని ఈ అబ్బాయిలు కాంపిటీషన్ వరకు ఎలా వెళ్లారు? అన్నది స్టోరీ.

Read Also : చుట్టూ చుట్టాలే ఉంటే ఫస్ట్ నైట్ ఎలా ? ఆ పని కోసం రెండు జంటల షాకింగ్ నిర్ణయం

Related News

OTT Movie : అర్ధరాత్రి ఇద్దరమ్మాయిల అరాచకం… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే మావా

OTT Movie : వాష్ రూమ్‌లో వరస్ట్ ఎక్స్పీరియన్స్… ‘విరూపాక్ష’ను మించిన చేతబడి… స్పైన్ చిల్లింగ్ సీన్స్

OTT Movie : నాలుగేళ్లుగా జియో హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతున్న వెబ్ సిరీస్… IMDbలో 9.1 రేటింగ్‌… ఇంకా చూడలేదా ?

OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్… ఓటీటీలో నెల రోజులుగా ట్రెండ్ అవుతున్న మూవీ… ఇంకా టాప్ 5 లోనే

Conistable Kanakam: ఫ్రీగా సినిమా చూడండి.. ఐఫోన్ గెలుచుకోండి ..బంపర్ ఆఫర్ ఇచిన మూవీ టీమ్!

OTT Movie : లైవ్‌లో అమ్మాయిని కట్టేసి ఆ పాడు పనులు చేసే సైకో… గూస్ బంప్స్ మూమెంట్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : ఈ వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, సిరీస్ లు… ఒక్కో భాషలో ఒక్కో సినిమా… ఈ 4 డోంట్ మిస్

OTT Movie : ‘థామా’కి ముందు చూడాల్సిన ఆయుష్మాన్ ఖురానా 4 థ్రిల్లింగ్ సినిమాలు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Big Stories

×