E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

రోజు గడిచాక బర్త్‌డే విషెస్.. అసలు కథేంటి? వైరల్ అవుతున్న త్రిష లేటెస్ట్ పోస్ట్!

రోజు గడిచాక బర్త్‌డే విషెస్.. అసలు కథేంటి? వైరల్ అవుతున్న త్రిష లేటెస్ట్ పోస్ట్!
Advertisement

Vijay Trisha: దళపతి విజయ్, త్రిష.. ఈ ఇద్దరి పేర్లు వినపడితే చాలు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే. వెండితెరపై ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘కురువి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో అలరించిన ఈ క్రేజీ కాంబినేషన్, రీసెంట్‌గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ సినిమాతో మరోసారి థియేటర్లలో పూనకాలు తెప్పించింది. అయితే కేవలం సినిమాల పరంగానే కాకుండా, వీరిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధంపై కూడా గత కొంతకాలంగా నెట్టింట రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక ఆసక్తికర పరిణామం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

ఊహించని షాక్ ఇచ్చిన త్రిష 

జూన్ 22న దళపతి విజయ్ పుట్టినరోజు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపించారు. అయితే అందరి కళ్లు మాత్రం ఒకే ఒక్కరి పోస్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూశాయి. ఆమే గ్లామర్ క్వీన్ త్రిష. విజయ్ బర్త్‌డే రోజున త్రిష నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సరిగ్గా రోజు గడిచిపోయింది అనుకునే సమయానికి, అంటే జూన్ 23న త్రిష ఒక ఊహించని షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో విజయ్‌ను అన్‌ఫాలో చేసిన ఈ ముద్దుగుమ్మ, ఆ వెంటనే ఆయనకు లేటుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక క్రేజీ పోస్ట్‌ను షేర్ చేసింది.

Advertisement

also read :‘హీరోయిన్లు గ్లామర్ డాల్స్ కాదు’.. మిల్కీ బ్యూటీ తమన్నా బోల్డ్ కామెంట్స్ వైరల్!

 డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న రూమర్స్ 

Advertisement

“ఇవన్నీ ఎంతో విలువైనవిగా మార్చే ప్రత్యేకమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు” అంటూ త్రిష రాసుకొచ్చిన క్యాప్షన్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అసలు విజయ్‌ను అన్‌ఫాలో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, పైగా ఒకరోజు ఆలస్యంగా విష్ చేయడం వెనుక ఉన్న మర్మమేంటని నెటిజన్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ ఒక్క పోస్ట్‌తో త్రిష పేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వీళ్లిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న రూమర్లకు ఈ తాజా పరిణామం మరింత ఆజ్యం పోసినట్లయింది.

ఎలాంటి మలుపులు తిరుగుతుందో

మరోవైపు విజయ్ కేవలం సినిమా హీరోగానే కాకుండా, ‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టి సీయం అయిన సంగతి తెలిసిందే.ఇక సినిమాల్లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఎంతగా వర్కవుట్ అయిందో, ఇప్పుడు రియల్ లైఫ్ మరియు పొలిటికల్ స్క్రీన్‌పై కూడా వీరి చుట్టూ ఉన్న సమీకరణాలు అంతే హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు అన్‌ఫాలో చేయడం, మరోవైపు గుండెకు హత్తుకునేలా బర్త్‌డే విషెస్ చెప్పడం.. ఇలా వరుస ట్విస్టులతో త్రిష అభిమానులకు ఊపిరి సలపనివ్వకుండా చేస్తోంది. మొత్తానికి ఈ ఇద్దరి చుట్టూ తిరుగుతున్న ఈ సస్పెన్స్ మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

also read :ఎవరికో నచ్చాలని కాదు.. డ్రెస్సింగ్ వివాదంపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ వైరల్!

Related News

బన్నీ-లోకేశ్ కాంబో.. షూటింగ్ మొదలవ్వకుండానే పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ అప్‌డేట్!

‘హీరోయిన్లు గ్లామర్ డాల్స్ కాదు’.. మిల్కీ బ్యూటీ తమన్నా బోల్డ్ కామెంట్స్ వైరల్!

రాష్ట్రపతి భవన్‌లో పండుగగా పద్మ అవార్డుల వేడుక.. పురస్కారాలు అందుకున్న విజేతలు వీరే!

పెద్ద సినిమాల్లో బూతులు కనిపించవా?సెన్సార్‌పై ‘దీవానా’ డైరెక్టర్ సెన్సేషన్ కామెంట్స్ !

ఎవరికో నచ్చాలని కాదు.. డ్రెస్సింగ్ వివాదంపై మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ వైరల్!

సుధీర్‌తో సినిమా‌ వార్తలపై స్పందించిన రష్మి.. అంత మాట అనేసిందేంటీ?

‘పెద్ది’ నా సినిమా కాపీనే.. డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

×