E-Paper
Advertisement

Chiranjeevi: సుకుమార్ శిష్యుడుతో చిరంజీవి సినిమా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో!

Chiranjeevi: సుకుమార్ శిష్యుడుతో చిరంజీవి సినిమా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఈయన మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరతెక్కిన ఈ సినిమా కామెడీ యాక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి రేసులో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం మంచి సక్సెస్ కావడంతో తదుపరి సినిమాలపై చిరంజీవి పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. మన శంకర్ వరప్రసాద్ సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈయన బాబి డైరెక్షన్లో చేయబోయే సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.

సుకుమార్ శిష్యులతో మెగాస్టార్..

డైరెక్టర్ బాబీతో ఒక గ్యాంగ్ స్టర్ డ్రామా చేయబోతున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అవుతూ వస్తోంది త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సినిమా చిరంజీవి కెరియర్లో 158వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వెలువడింది.

శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమా..

Advertisement

శ్రీకాంత్ సైతం సుకుమార్ శిష్యుడు అనే విషయం మనకు తెలిసిందే. నాని హీరోగా దసరా సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన శ్రీకాంత్ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం నానితో ది ప్యారడైజ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ సినిమా ఉండబోతోంది. అయితే ఇటీవల సుకుమార్ మరో శిష్యుడు కూడా చిరంజీవిని కలిసి ఒక అద్భుతమైన కథను చెప్పారని తెలుస్తోంది.

గ్రామీణ కథ నేపథ్యంలో..

Advertisement

డైరెక్టర్ సుకుమార్ వద్ద ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా కొనసాగుతూ దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్న శ్రీనివాస్(Srinivas) (శ్రీను మాయ) చిరంజీవి గారిని కలిసి ఒక విలేజ్ స్టోరీ వివరించారట. ఇలా శ్రీను నేరేషన్ కు మెగాస్టార్ ఫిదా అయ్యారని వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సుకుమార్ శిష్యులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. మరి శ్రీనివాస్ మెగా కాంబినేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా ఓకే అయినప్పటికీ శ్రీకాంత్ ఓదెల సినిమా తర్వాతనే ఉండబోతుందని తెలుస్తోంది.

Also Read: Lock Down OTT: సడన్ గా ఓటీటీలోకి వచ్చిన అనుపమ ‘లాక్ డౌన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×