E-Paper
Advertisement

చిరు – శ్రీకాంత్ ఓదెల సినిమా అటకెక్కినట్టేనా ?

చిరు – శ్రీకాంత్ ఓదెల సినిమా అటకెక్కినట్టేనా ?
Advertisement

Chiranjeevi–Srikanth Odela Movie:ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్యారడైజ్ సినిమా ఎట్టకేలకి ఈనెల 24న థియేటర్ లలోకి వచ్చేసింది.అయితే సినిమా ప్రీమియర్స్ 23న రాత్రే పడటంతో అనుకున్నంత లేదని కొంతమంది అంటే పర్లేదు సినిమా బాగానే ఉంది అంటూ మరికొంతమంది కామెంట్స్ చేశారు.

ఇలా ప్రీమియర్స్ కంప్లీట్ అవ్వగానే డివైడ్ టాక్ బయటికి వచ్చేసింది,అయితే ఆ డివైడ్ టాక్ కాస్తా రిలీజ్ డే మార్నింగ్ షో పూర్తవగానే నెగెటివ్ టాక్ గా స్ప్రెడ్ అవడంతో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.అయితే ఇంత నెగెటివిలో కూడా సినిమా రెండు రోజుల్లోనే ఏకంగా 114 కోట్లు వసూలు చేయడం విశేషం.

Advertisement

మెజారిటీ వేళ్ళన్నీ శ్రీకాంత్ ఓదెల వైపే

అయితే సినిమా లో నాని అదరగొట్టాడు అన్న టాక్ వినిపిస్తున్నప్పటికీ,ఈ నెగెటివ్ టాక్ కి కారణం ఏంటంటే మెజారిటీ వేళ్ళన్నీ శ్రీకాంత్ ఓదెల వైపే తిరుగుతున్న పరిస్థితి. సినిమాలో ఫస్ట్ హాఫ్,అలాగే యాక్షన్ సీన్స్ ని బాగానే తెరకెక్కించాడు అన్న పేరు తెచ్చుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో చేతులెత్తేశాడని ,కథ,కథనంలో డ్రా బ్యాక్స్ ఉన్నాయని ,అవి గనుక సరిగ్గా చూసుకుని ఉంటె సినిమా ఈజీగా ఐదొందల కోట్లు కొలగొట్టేదని మెజారిటీ ఆడియన్స్ తేల్చేస్తున్నారు.

Advertisement

మొత్తంగా చూస్తే శ్రీకాంత్ ఓదెల ద్వితీయ విఘ్నం తప్పించుకోలేకపోయాడని ఫిలిమ్ సర్కిల్స్ లో కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

అంచనాలు ఎక్కడికో

ఇక ఇదిలా ఉంటే ఇపుడు అందరి దృష్టి శ్రీకాంత్ ఓదెల తర్వాతి సినిమాపైనే ఉంది.కారణం అది చిరు సినిమా అవ్వడమే. అవును ..ప్యారడైజ్ సినిమా షూట్ మధ్యలో ఉండగానే శ్రీకాంత్ ఓదెల చిరుని కలిసి కథ చెప్పడం, నాని నిర్మాతగా సినిమా చేస్తానని అనడం, ప్యారడైజ్ తర్వాత ఇదే సినిమా ఉంటుందని అంతా తేల్చేయడంతో ఇక బాస్ మరోసారి రా అండ్ రస్టిక్ వయోలెన్స్ తో అదరగొడతాడని మురిసిపోయారు మెగా అభిమానులు.

పైగా అదే సమయంలో రెండు శ్రీకాంత్ ఓదెల, చిరు కలిసి బ్లడ్ షేడ్ తో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టుగా ఉన్న ఒక క్రేజీ పిక్ వదలడంతో ఈ సినిమా పై అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి.కాని సీన్ కట్ చేస్తే ప్యారడైజ్ సినిమా కాస్తా నెగెటివ్ టాక్ మోస్తుంది.భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న సినిమా కాస్తా ఊహించని ఫలితాన్ని చూడటంతో ఇపుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న.

ఈ కుర్ర డైరెక్టర్ జాక్ పాట్ కొట్టినట్టే

తర్వాతి సినిమా చేస్తానని మాట ఇచ్చిన చిరు ఆ మాటకి కట్టుబడి శ్రీకాంత్ మూడో సినిమాని చేస్తాడా లేక కమర్షియల్ ,ట్రేడ్ ,బిజినెస్ అంటూ మెల్లిగా దాట వేస్తాడా అని చిరు ఆన్సర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంతా.ఒక వేళ ఇదేమీ పట్టించుకోకుండా శ్రీకాంత్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఈ కుర్ర డైరెక్టర్ జాక్ పాట్ కొట్టినట్టే.

also read :వీడెక్కడ దొరికాడ్రా సామీ.. బాలు గారి గొంతుతో మళ్ళీ రచ్చ లేపిన దైవిక్! సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్!

చూడాలి మరి ప్యారడైజ్ కి వచ్చిన నెగెటివ్ టాక్ లక్కీ ఛాన్స్ ని మిస్ చేస్తుందా లేక దానికి సంబంధం లేకుండా మెగా ఛాన్స్ పట్టేస్తాడా అన్నది మరి కొన్ని రోజులు ఆగితే కాని తెలీదు. !

Tags

Related News

‘డోరతీ’ సినిమాలో కీర్తి సురేష్ ఇంటిమేట్ సీన్.. సోషల్ మీడియాలో నిరసన సెగ!

ది ప్యారడైజ్ ఫస్ట్ చాయిస్ కయాదు కాదా? ఆమె రిజెక్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చిందా?

పెళ్లి కావాలి, పిల్లలు వద్దు.. గర్భసంచి అవసరం లేదు: స్నిగ్ధ!

హీరో కాకపోతే నాని ఆ పని చేసేవాడా? చెప్తే లాజిక్ ఉండాలి బ్రో!

సుమలత వల్లే ఇన్ని సమస్యలు.. డాన్సర్స్ సమావేశంలో సీనియర్ మాస్టర్స్ ఫైర్!

మరో వివాదంలో ది ప్యారడైజ్..సమ్మక్క పాత్రను అవమానించారంటూ?

జూహీ చావ్లా ఆస్తులు డబుల్.. ఒక్క ఏడాదికి అన్ని కోట్లా..?

Big Stories

Advertisement
×