E-Paper
Advertisement

మరీ ఇంత దారుణమా.. సూర్యపేట జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్!

మరీ ఇంత దారుణమా.. సూర్యపేట జిల్లాలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్!
Advertisement

Pension Bribe: స్వేచ్చ బ్యూరో: పదవీ విరమణ పొందిన తోటి ఉద్యోగిణి పింఛను ప్రతిపాదనలు పంపడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు లంచం డిమాండ్‌ చేసిన ముగ్గురు ఉద్యోగులపై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ కొరడా ఝళిపించారు. ఈ మేరకు సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌లను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు.

పదవీ విరమణ..

షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) అభివృద్ధి శాఖలో విధులు నిర్వర్తించిన ఓ ఉద్యోగిణి గత మార్చి నెలలో పదవీ విరమణ పొందారు. అయితే ఆమెకు రావాల్సిన పింఛను, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ తాలూకు ఫైలును (పెన్షన్‌ ప్రపోజల్‌) ఎప్పటికప్పుడు పై కార్యాలయానికి పంపించాల్సి ఉండగా.. గతంలో పని చేసిన అధికారిణితో పాటు సంబంధిత విభాగ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు. ఆ శాఖకు చెందిన గతంలో పనిచేసిన సీనియర్ అధికారిణితో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ జి.రవివర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ బి.యాదగిరి, అటెండర్‌ బి.రాము బాధితుడి నుంచి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్‌ చేశారు.

Advertisement

Also read: రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

కలెక్టర్‌కు ఫిర్యాదు..

అడిగిన మొత్తం ఇస్తేనే ఫైలుపై సంతకాలు చేసి ముందుకు పంపుతామని చెప్పడంతో ఆ మొత్తం ఇచ్చేందుకు బాధితురాలు నిరాకరించడంతో నెలల తరబడి ఫైల్ కదలకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్వీసు ముగిసి నెలలు గడుస్తున్నా లంచం ఇవ్వలేదనే సాకుతో తన పెన్షన్‌ ఫైలును కదలకుండా అడ్డుకుంటున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఆవేదనపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్.. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులు జరిపిన విచారణలో ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేసిన మాట వాస్తవమేనని, విధుల్లో తీవ్ర అలసత్వం, బాధ్యతారాహిత్యం ప్రదర్శించారని తేలింది.

అధికారులు సస్పెండ్..

Advertisement

విచారణ నివేదిక ఆధారంగా సీనియర్‌ అసిస్టెంట్‌ రవివర్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ యాదగిరి, అటెండర్‌ రాములను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు వెలువరించారు. దింటితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అధికారిణి పై సైతం సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించినా, ప్రజలను లేదా విశ్రాంత ఉద్యోగులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ లంచాల కోసం వేధించినా ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Also read: హీరో కాకపోతే నాని ఆ పని చేసేవాడా? చెప్తే లాజిక్ ఉండాలి బ్రో!

Tags

Related News

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వచ్చే మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే!

నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 10+2 విధానంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, దంపతుల మృతి

చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం

Big Stories

Advertisement
×