Sridevi: జాబిలి.. కోర్ట్ (Court) మూవీతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎక్కడో పల్లెటూర్లో ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ వెలుగులోకి వచ్చిన ఈమె అనూహ్యంగా సినిమా ద్వారా తన ఉనికిని చాటుకుంది. ఇందులో జాబిలి పాత్రలో అమాయకపు పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. పక్కింటి అమ్మాయిలా కనిపించి, ఎంతోమంది హృదయాలను దోచుకుంది. అంతేకాదు యువత ఫేవరెట్ హీరోయిన్గా కూడా పేరు సొంతం చేసుకుంది.
టీటీడీ ఫ్రీ బస్ సర్వీస్ పై శ్రీదేవి కామెంట్స్..
ఇకపోతే ఒక్క సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీదేవి.. ఏమాత్రం ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోకుండా చాలా ఫ్రీగా పబ్లిక్ లో తిరిగేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి చేసిన ఈమె.. అక్కడ టీటీడీ ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సు లో ప్రయాణించి.. ఫ్రీ బస్సు సర్వీసు గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో షేర్ చేసిన శ్రీదేవి.. అందులో అసలు విషయాన్ని చెప్పడమే కాకుండా తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది అని చెప్పవచ్చు.
ఫ్రీ బస్ ప్రయాణం చాలా బాగుంది – కాకినాడ శ్రీదేవి
శ్రీదేవి తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఆ వీడియో షేర్ చేస్తూ.. “తిరుమల తిరుపతి దేవస్థానం వారు 100కి పైగా ఫ్రీ బస్సులను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫ్రీ బస్సు ప్రయాణం చాలా బాగుంది. ముఖ్యంగా చాలా ఫ్రీగా కూడా ఉంది. టీటీడీ వారు ఏర్పాటు చేసిన ఈ వందకి పైగా బస్సులు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లడానికి ప్రొవైడ్ చేస్తున్నారట. సర్వీస్ చాలా బాగుంది. ఈ బస్సులు చాలా క్లీన్ గా ఉండటమే కాకుండా చాలా ప్రశాంతంగా కూడా ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్లాలనుకున్న దానినిబట్టి స్టాప్ కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి” అంటూ తన అనుభవాన్ని పంచుకుంది శ్రీదేవి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఇంస్టాగ్రామ్ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
కోర్ట్ మూవీ సినిమా విశేషాలు..
ఈ కోర్టు మూవీ విషయానికి వస్తే.. కోర్ట్ : స్టేట్ వర్సెస్ ఏ నో బడీ అనే శీర్షికతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న సినిమానే అయినా ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యింది. తెలుగు భాష లీగల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, కాకినాడ శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. శివాజీ, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి , రాజశేఖర్ ఆనింగి, హర్షవర్ధన్, రోహిణి తదితరులు నటించారు. ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని నిర్మించారు. ఈ సినిమాలో జాబిలి పాత్రలో నటించిన శ్రీదేవి కాకినాడలో ఒకవైపు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూనే.. మరొకవైపు ఈ సినిమాలో నటించింది. 2025 మార్చి 14న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.
ALSO READ:The Kerala story: రెండు నేషనల్ అవార్డ్స్.. కేంద్రంపై సీఎం ఫైర్.. అసలు ఏమైందంటే?
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==