CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ కంపెనీ నిష్క్రమించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్ అండ్ టీ సంస్థ హైదరాబాద్ మెట్రో మొదటి దశలో నష్టాలు చవి చూశామని పేర్కొన్నదని సీఎం స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీళఆర్, ఎల్ అండ్ టీ తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయని ఆయన అన్నారు. మెట్రో రెండో దశ పనులను ముందుకు తీసుకెళ్లడంలో ఎల్ అండ్ టీ సహకరించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ రాజకీయ స్వార్థాల కోసం మెట్రో రెండవ దశ పనులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 2017 నాటికి మెట్రో ప్రాజెక్ట్ మొత్తం పూర్తి కావాల్సి ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు ప్రాజెక్టు ముందుకు సాగలేదని ఆయన సీఎం తీవ్ర స్థాయిలో విమర్శించారు.
అలాగే, ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందించడం లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రతి సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్ అండ్ టీ షరతులు విధిస్తే, రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండబోదని ఆయన హెచ్చరించారు. సంస్థ రాష్ట్రంతో సహకరించి పని చేయాల్సిన బాధ్యత ఉందని, షరతులు విధించడం కాదని ఆయన అన్నారు.
ALSO READ: Fake doctors: హైదరాబాద్‌లో ఫేక్ డాక్టర్.. ఎలాంటి లైసెన్స్ లేకుండా వైద్యం.. చివరకు?
మెట్రో విస్తరణకు అనుమతులు ఇవ్వాలంటే ఎల్ అండ్ టీతో కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలన్న కేంద్రం నిబంధనను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ల నాటకమని, వారు తమ రాజకీయ అజెండా కోసం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆయన సీఎం ఆరోపించారు. ప్రస్తుతం రోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోను ఉపయోగిస్తున్నారని, రెండవ దశ పూర్తయితే ఈ సంఖ్య 15 లక్షలకు పెరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ: Woman Arrest: దుబాయ్ నుంచి దర్జాగా.. రూ.12 కోట్లు విలువ చేసే గంజాయి స్మగ్లింగ్, మహిళ అరెస్ట్
కాళేశ్వరం విచారణ సీబీఐకి ఇవ్వమన్నారు… ఇచ్చిన తర్వాత బీజేపీ మాట్లాడటం లేదు. సీబీఐకి ఇస్తే 48 గంటల్లోనే తేల్చుతామన్న కిషన్ రెడ్డి ఎందుకు దాక్కున్నారో సమాధానం చెప్పాలి. సీబీఐ ఒకసారి FIR చేసిన తర్వాత ఎవరినైనా విచారించవచ్చు. కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఆపుతున్నారు. కిషన్ రెడ్డి ఆపుతున్నారు. 48 గంటల్లో తేల్చుతామన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు. ఫోన్ టాపింగ్ కేసు కోర్టులో ఉంది. కిషన్ రెడ్డికి సొంత ఆలోచనలు లేవు. కిషన్ రెడ్డి కేటీఆర్ ఏది చెబితే అదే చేస్తాడు’ అని అన్నారు.