Parthiv Patel On Bumrah vs Kohli: యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాను రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేజేతులా వదిలేసుకున్నట్టు మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ( Parthiv Patel) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుమ్రాను ( Jasprit Bumrah) కొనుగోలు చేయాలని 2014 ఐపీఎల్ వేలం సందర్భంగా అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీతో ( Virat Kohli) పాటు ఆర్సీబీ ( Royal challengers Benguluru) యాజమాన్యానికి తాను సూచనలు చేసినట్టు పార్థివ్ పటేల్ షాకింగ్ నిజాలను పంచుకున్నారు.
కానీ బుమ్రాను లైట్ తీసుకోవాలని, విరాట్ కోహ్లీ బలుపు చూపించాడని మండిపడ్డారు. వదిలేయ్ భయ్యా.. బుమ్రా లేదు, వుమ్రా లేదు.. అతడు పెద్ద పోటుగాడు కాదంటూ విరాట్ కోహ్లీ తేలికగా కొట్టిపారేశాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ తరుణంలోనే బుమ్రాను ( Jasprit Bumrah) ముంబై ఇండియన్స్ తెలివిగా కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత బుమ్రా ఓ రేంజ్ కు వెళ్లాడని గుర్తు చేశారు. ముంబై ఇండియన్స్ కూడా అతన్ని బాగానే వాడుకుందని తెలిపారు. తాను చెప్పినట్టు వినింటే, ఇప్పటికీ ఆర్సీబీలోనే బుమ్రా ఉండేవాడని స్పష్టం చేశారు. దీంతో మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ( Parthiv Patel) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
2014లో తాను చెప్పినట్టు బుమ్రాను కొనుగోలు చేసుంటే, ఆర్సీబీ 5 టైటిల్స్ ఇప్పటికే గెలిచేదంటూ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 వేలంలో తనను లంచ్ సమయానికి ఆర్సీబీ కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. దీంతో వెంటనే బుమ్రాను కొనుగోలు చేయాలని ఆర్సీబీకి చెప్పానన్నారు. దేశవాళీ క్రికెట్ లో బుమ్రా అప్పటికే బాగా ఆడాడని, తానే స్వయంగా చూసినట్టు వాళ్లకు చెప్పానని వివరించారు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ కూడా భయంకరంగా ఉందని, దీంతో జట్టు ఉపయోగమని సూచనలు చేసినట్టు గుర్తు చేశారు.
కానీ ఆర్సీబీ, విరాట్ కోహ్లీ… బుమ్రా సామర్థ్యాన్ని అంచనా వేయలేదని షాకింగ్ నిజాలను బయట పెట్టారు. ఇది ఇలా ఉండగా, 2014 ఐపీఎల్ వేలంలో బుమ్రాను ఆర్సీబీ వద్దనుకోగా, వెంటనే ముంబై ఇండియన్స్ రంగంలోకి దిగింది. రూ.1.20 కోట్ల బేస్ ధరకే బుమ్రాను కొనేసింది. ఈ తర్వాత బుమ్రా ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్ గా మారిపోయాడు. ప్రస్తుతం రూ.18 కోట్లు బుమ్రా తీసుకుంటున్నాడు. రూ.18 కోట్లు పెట్టిన ప్రతీ ఏడాది రిటైన్ చేసుకుంటున్న ముంబై ఇండియన్స్.. బుమ్రాకు సముచిత స్థానం కూడా కల్పిస్తోంది. వచ్చే సీజన్ లో పాండ్యా స్థానంలో కెప్టెన్సీ కూడా ఇచ్చే చాన్సులు కనిపిస్తున్నాయి.