E-Paper
Advertisement

ధనుష్ నోరు విప్పలేదు.. ఫ్యాన్స్ మాత్రం పని మొదలుపెట్టేశారు!

ధనుష్ నోరు విప్పలేదు.. ఫ్యాన్స్ మాత్రం పని మొదలుపెట్టేశారు!
Advertisement

Dhanush Politics: విజయ్ ..తమిళనాట దళపతిగా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం తమిళనాట సీయం గా సెటిల్ అయిపోయాడు.ఒకరకంగా ఇది అటు సినీ ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ వర్గాలకి కూడా పెద్ద షాకే.వస్తే పదో పరకో సీట్లోస్తాయేమో అనుకున్నారంతా కానీ ఊహించని విధంగా dmk, అన్నా డీయంకే వంటి రెండు బలమైన పార్టీలని మట్టి కరిపించి ఏకంగా ముఖ్యమంత్రి అవడం దేశ వ్యాప్తంగా సంచనలనం స్ప్రుష్టించింది.

దీంతో ఇపుడు కోలీవుడ్ లోని మిగతా సినీ తారలకి కూడా పాలిటిక్స్ వైపు మనసు మళ్ళుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అభిమానుల ద్వారా పనులు చక్కబెడుతున్నారా?

Advertisement

అయితే తమ మనసులోని మాటలని నేరుగా బయటకి చెప్పలేక తమ అభిమానుల ద్వారా పనులన్నీ చక్కబెడుతున్నారా అన్న గుస గుసలు ఇపుడు కోలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి.ప్రస్తుతం కోయంబత్తూరులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధనుష్ అభిమాన సంఘాలను ఏర్పాటు చేయాలని, కొత్త సభ్యులను భారీగా చేర్చుకోవాలని ‘ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’ పిలుపునివ్వడమే ఇపుడు వీటికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

కోయంబత్తూరు నార్త్, కౌండంపాలయం, సింగనల్లూర్, సులూర్, మేట్టుపాళ్యం ప్రాంతాల్లో ఫ్యాన్ క్లబ్‌లను బలోపేతం చేయాలని ఆగస్టు 8న ఓ ప్రకటన ఇచ్చారు కూడా.అయితే ధనుష్ స్వయంగా పార్టీ పెడుతున్నానని,కానీ పాలిటిక్స్ లోకి వస్తున్నానని కానీ ఎక్కడా చెప్పలేదు.ఇంకా అనుమానం ఎందుకంటారా ..?

 విజయ్ కూడా ఇలాగే మొదలుపెట్టాడా?

Advertisement

ఎంజీఆర్, జయలలిత నుంచి మొదలుకుని విజయకాంత్, కమల్ హాసన్ వరకు సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లు రాజకీయాల్లో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్న వారే .ఇక ఇపుడు సీయం సీట్లో కూర్చున్న విజయ్ కూడా ఒకప్పుడు అభిమానాల సంఘాలతో ఇలా హడావిడి చేసి తర్వాత తమిళగ వెట్రి కళగం’ అంటూ పార్టీ పెట్టాడు.

కట్ చేస్తే తమిళనాడుకే పెద్ద పార్టీలని మట్టికరిపించిన ముఖ్యమంత్రి అయిపోయాడు.ఇక ఇపుడు ధనుష్ కూడా అలానే ప్లాన్ చేసి పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన చేస్తున్నాడా అన్న డౌట్స్ ఇపుడు తమిళ తంబీల్లో పుట్టుకొస్తున్నాయి.

ఫ్యాన్ క్లబ్‌కి రాజకీయ రంగు ఎందుకు?

అయితే మరికొందరు ఇది కేవలం ఫ్యాన్స్ అసోసియేషన్ మాత్రమే కదా.. దానికి రాజకీయ రంగు ఎందుకు పూస్తున్నారు?అంటూ వాదిస్తుంటే రాజకీయాలని అవపోసన పట్టిన వాళ్ళు దీన్ని అంత ఈజీగా తీసుకోవడం లేదు.

ఇపుడు ఎవరైనా హీరో ఇలా ఫ్యాన్ క్లబ్ అన్నాడంటే చాలు దాని వెనుక ఏమైనా పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉందా అంటూ బూతద్దం పెట్టి మరీ ఆరాలు తీస్తున్నారు.

 ధనుష్‌కి తమిళనాట భారీ ఫాలోయింగ్

ఇక ధనుష్ విషయానికి వస్తే ఈ స్టార్ హీరోకి తమిళనాడు తో నేషనల్ వైడ్ గా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెల్సిందే.ముఖ్యంగా ‘పొల్లాదవన్’, ‘ఆడుకలం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’, ‘కర్ణన్’ వంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని బిల్డ్ చేసుకున్నాడు.

ఇక తమిళనాడులోనే కాకుండా కుభేర వంటి సినిమాలతో తెలుగులోనూ, ‘రాంఝనా’, ‘అత్రంగి రే’ లాంటి హిందీ సినిమాలతో నార్త్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

 వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్

ఇక ప్రస్తుతం ధనుష్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ‘ఓం: చాప్టర్ 1’తో పాటు తమిళరసన్ పచముత్తు దర్శకత్వంలో డీ56 సినిమా చేయబోతున్నాడు.‘కర్ణన్’ తర్వాత దర్శకుడు మారి సెల్వరాజ్‌తో మరోసారి కలిసి జత కట్టబోతున్నాడు.మరో వైపు వెట్రిమారన్‌తో ‘తమిళ్ మురుగన్’ కోసం సిద్దమైపోతున్నాడు .

 వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ ఎంట్రీ..?

నిజానికి ఈ బిజీ లైనప్ లో ధనుష్ సమయం కేటాయించి ఫ్యాన్స్ క్లబ్ వైపు దృష్టి సారిస్తాడా అంటే…. ఏమో చెప్పలేము.వీటన్నింటిని చక చకా పూర్తి చేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్ల నాటికి విజయ్ కి బలమైన ప్రత్యర్ధిగా మారతాడేమో చెప్పలేము.

also read :‘టాక్సిక్’ ట్రైలర్.. నువ్వు జోకర్‌వి కాదు బాస్టర్డ్.. వామ్మో ఇంత వైల్డ్‌గా ఉందేంటి?

అధికారం ఒడిసి పట్టి సీయం సీట్లో కూర్చోవాలని ఎవరికుండదు ?కావాల్సిందల్లా ప్రజా ఆమోదం మాత్రమే!

Tags

Related News

చిరంజీవినే లెక్క చేయని జానీ మాస్టర్..ప్రమాణ స్వీకారానికి వాళ్లంతా దూరం!

కోతి తెచ్చిన తంటా.. చిక్కుల్లో పడ్డ హీరో విక్రమ్?

వారణాసిలో రామ్ చరణ్.. ఏ పాత్రలో అంటే?

ఆగస్టు 15న మూవీ మజా.. ఏకంగా 7 సినిమాలు.. ఆ 2 మూవీస్ మస్ట్ వాచ్!

నా ఓటు గల్లంతయ్యింది -ప్రకాష్ రాజ్

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేస్ ఫైల్.. యువతికి హత్యా బెదిరింపులు!

స్టోరీ రైటర్స్ కు లక్కీ ఛాన్స్.. అన్నపూర్ణ స్టూడియోలో అవకాశం..!

Big Stories

Advertisement
×