E-Paper
Advertisement

Harish Shankar: పవన్‌తో షూటింగ్ కష్టంగా ఉందా? హరీష్ శంకర్ కామెంట్స్ వింటే ఫ్యూజులు అవుట్

Harish Shankar: పవన్‌తో షూటింగ్ కష్టంగా ఉందా? హరీష్ శంకర్ కామెంట్స్ వింటే ఫ్యూజులు అవుట్
Advertisement

Harish Shankar: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా రీమేక్ గురించి అలాగే షూటింగ్ లొకేషన్ లో పవన్ కళ్యాణ్ తో ఎదురైన ఇబ్బందుల గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

పవన్ ను కలవాలంటే కఠినమైన చర్యలు..

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సాధారణ హీరో మాత్రమే అందుకే ఆయనతో షూటింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో షూటింగ్ సమయంలో కాస్త ఇబ్బందులు చోటు చేసుకున్నాయని హరీష్ శంకర్ ఈ సందర్భంగా తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి అంటే నేరుగా కారవాన్ లోకి వెళ్లి మాట్లాడేవాడిని కానీ ప్రస్తుతం అలా కుదరదని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడంతో కఠినమైన భద్రతా చర్యలు ఉన్నాయని తెలిపారు.

ప్రతిరోజు డాగ్ స్క్వాడ్ ఉంటుంది..

Advertisement

పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అంటే ముందుగా ప్రోటోకాల్ ఆఫీసర్లు మెటల్ డిటెక్టర్‌తో చెక్ చేసి పంపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ లొకేషన్లో ఉన్నారు అంటే ప్రతిరోజు ఉదయం షూటింగ్ లొకేషన్లోకి డాగ్ స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు తన సెక్యూరిటీతో మనవాళ్లే ఎక్స్క్యూజ్ ఇవ్వండి అని చెప్పినప్పటికీ ఆయన సెక్యూరిటీ మాత్రం పవన్ కళ్యాణ్ కు రక్షణ కల్పించే విషయంలో ఎలాంటి రాజీ పడరని హరీష్ శంకర్ తెలిపారు.

పవన్ చేతిని తాకడానికి కూడా వీల్లేదు..

Advertisement

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా సీన్ వివరిస్తున్న సమయంలో ఆయన చేతిని తాకిన సెక్యూరిటీ వెంటనే అడ్డు పెడతారు. ఇక ఫైట్ సన్నివేశాలు చేసే సమయంలో ఉపయోగించే వెపన్స్ విషయంలో కూడా సెక్యూరిటీ కచ్చితంగా చెక్ చేస్తారని, అవి నిజమైనవా లేక డమ్మివా అనేది పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే మేము షూట్ చేయాల్సి ఉంటుంది అంటూ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ కారణంగా ఎదురైన ఇబ్బందుల గురించి హరీష్ శంకర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక డిప్యూటీ సీఎం హోదా అంటే ఈ స్థాయిలో సెక్యూరిటీ ఉంటుందనీ చెప్పాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పలు సినిమాలకు కమిట్ అవుతూ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజి సినిమా మంచి సక్సెస్ కావడం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Also Read: Manchu Vishnu: దుబాయ్‌లో పరిస్థితిపై మంచు విష్ణు కీలక పోస్ట్.. అంతా సేఫేనా?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×