Nag Ashwin: ప్రభాస్ (Prabhas) హీరోగా, నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజువల్ వండర్ కల్కి 2898AD చిత్రం. బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ మూవీలో కమలహాసన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ తారాగణంతో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పోషించిన సుమతి పాత్ర కథకు మూల స్తంభంగా నిలిచింది. కల్కి2లో కూడా దీపిక నటిస్తుంది అంటూ గతంలో వార్తలు వచ్చినా.. వైజయంతి మూవీ మేకర్స్ ఆమెను ఈ సినిమాలో తీసుకోవడం లేదు అంటూ అధికారికంగా ప్రకటించారు. అత్యధిక రెమ్యూనరేషన్, పని గంటల కారణంగా ఆమెను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దీపికా పదుకొనే స్థానంలో మరో నటి రానుంది అంటూ కొన్ని రోజులు ఊహాగానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే వాటిపై తాజాగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.
కల్కి 2 చిత్రంలో సుమతి పాత్రను ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు? అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు రాగా, తాజాగా నాగ్ అశ్విన్ ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ .. “కల్కి 2898AD చిత్రంలోని దీపికా పదుకొనే పాత్రను, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కల్కి 2 లో వేరే నటితో భర్తీ చేయడం లేదు. కల్కి 2లో ఆమె కనిపించనప్పటికీ.. కొత్తగా ప్రధాన నటీనటులు ఎవరూ కూడా ఇందులో చేరడం లేదు. మొదటి భాగంలోనే కావాల్సినన్ని బలమైన పాత్రలు ఉన్నందున.. ఇప్పటికే పరిచయమైన క్యారెక్టర్ల చుట్టూనే రెండో భాగం కథ కూడా కొనసాగుతుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో దీపిక స్థానంలో సాయి పల్లవి, అలియా భట్ నటిస్తారు అంటూ ఇండస్ట్రీలో చెక్కర్లు కొట్టిన ప్రచారాలన్నీ కూడా ఒట్టి పుకార్లు గానే తేలిపోయాయి.
నాగ అశ్విన్ మాటలను బట్టి చూస్తే దీపికా పదుకొనే రెండవ భాగంలో నటించడం లేదు అంటే ఇక సుమతి పాత్ర ముగిసినట్టేనా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. కల్కి మొదటి భాగం లో కథ మొత్తం సుమతి గర్భంలో పెరిగే శిశువు చుట్టూనే తిరుగుతుంది. అశ్వద్ధామ ఆమెను కాపాడే ప్రయత్నం చేయడం, భైరవ ఆమెను పట్టుకోవాలని చూడడం , సుప్రీం యాస్కిన్ సైన్యం వేటాడడం.. ఇలా అన్ని ఘట్టాలకు కూడా సుమతి పాత్ర కేంద్ర బిందువు. అలాంటి పాత్రధారి తప్పుకున్నప్పుడు సాధారణంగా మరో నటిని ఎంచుకోవడం సినీ ఇండస్ట్రీలో సాంప్రదాయమే. కానీ నాగ్ అశ్విన్ మాత్రం రీప్లేస్మెంట్ ఆలోచన లేదని చెప్పడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
also read: మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?
అంటే రెండవ భాగంలో సుమతి ఉనికిణి ఎలా చూపిస్తారు? ఆ పాత్ర అక్కడితో ముగిస్తారా? లేక కథ నడిచే తీరులోనే ఆమె పాత్రను పరోక్షంగా ప్రస్తావిస్తారా ? అనే చర్చ కూడా మొదలయ్యింది. ఏది ఏమైనా అప్పుడు దీపికాను తీసేస్తున్నాం అంటూ చిత్ర బృందం చెప్పి అనుమానాలు రేకెత్తించగా.. ఇప్పుడునాగ్ అశ్విన్ చేసిన కామెంట్లతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.
After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.
And a film like…
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025