E-Paper
Advertisement

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై బదిలీల్లో కొత్త రూల్స్?

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ఇకపై బదిలీల్లో కొత్త రూల్స్?
Advertisement

Engineer Transfers: స్వేచ్ఛ బ్యూరో: నీటిపారుదల, కమాండ్‌ ఏరియా అభివృద్ధి (ఐ అండ్ సీఏడీ) శాఖలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న సహాయక కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయక ఇంజినీర్ల అంతర్గత ‘ఆన్‌ డ్యూటీ’ (ఓ.డీ) బదిలీలపై ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ (పరిపాలన) టి.శ్రీనివాస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రాంతీయ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ సర్క్యులర్‌ మెమో విడుదల చేశారు.

నమొదులో ఇబ్బందులు..

వివిధ ప్రాంతీయ విభాగాల పరిధిలోని ఈఎన్‌సీలు, చీఫ్‌ ఇంజినీర్లు తమ పరిధిలోనే ఇంజినీర్లను ఓడీ ప్రాతిపదికన బదిలీ చేస్తూ.. ఆ తర్వాత రాష్ట్ర కార్యాలయం ఆమోదం (రాత్రిఫికేషన్‌) కోసం ప్రతిపాదనలు పంపుతున్నట్లు గుర్తించామన్నారు. ‘తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు’ అంటూ ఇష్టానుసారంగా ఇస్తున్న ఇలాంటి బదిలీల వల్ల మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ లో ఆయా ఇంజినీర్ల సేవా వివరాలను నమోదు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే యూనిట్ల వారీగా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Also read: అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

భవిష్యత్తులో..

నిబంధనల ప్రకారం ఏఈఈలు, ఏఈల డైవర్షన్‌ లేదా ఓడీ బదిలీ ఉత్తర్వులు జారీ చేసే పూర్తి అధికారం కేవలం హైదరాబాద్‌లోని ఈఎన్‌సీ (పరిపాలన) కార్యాలయానికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రాంతీయ విభాగాల అధికారులు ఎవరూ కూడా తమ సొంత నిర్ణయాలతో ఇలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని కచ్చితమైన నిబంధన విధించారు. తమ పరిధిలోని సూపరింటెండింగ్‌ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకుకూడా ఇదే విషయాన్ని తెలియజేయాలని ఆదేశించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడైనా అత్యవసరంగా బదిలీలు అవసరమని భావిస్తే, నిబంధనల ప్రకారం పూర్తి ప్రతిపాదనలను రాష్ట్ర కార్యాలయానికి పంపి, ముందస్తు అనుమతి పొందాలని సూచించారు.

Advertisement

Also read: 20% – 80% రూల్ నిజంగానే ల్యాప్‌టాప్ బ్యాటరీని కాపాడుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

Tags

Related News

నార్సింగిలో పట్టభద్రుల శంఖారావం.. ఓటరు నమోదు ప్రారంభించిన పొన్నం ప్రభాకర్!

హైదరాబాద్‌లో భారీ చీటీల మోసం.. రూ. 16 కోట్లతో కుటుంబం పరారీ!

ఇంకో 20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.. రాసి పెట్టుకో కేటీఆర్: అద్దంకి దయాకర్

మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి

అస్తిత్వ పోరాటానికి దృశ్య రూపం.. థియేటర్‌లో ‘పారడైజ్’ మూవీ వాచ్.. కేటీఆర్‌తోపాటు సీనియర్ నేతలు

ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 30 మంది ప్రయాణికులు, చౌటుప్పల్ వద్ద ఘటన

డీసీఎం ఢీకొని ఆరు పాడి గేదెలు మృతి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాత!

Big Stories

Advertisement
×