E-Paper
Advertisement

Nithin – Ram: కొత్త సినిమా ప్రకటించిన నితిన్.. మరి రామ్ సంగతేంటి?

Nithin – Ram: కొత్త సినిమా ప్రకటించిన నితిన్.. మరి రామ్ సంగతేంటి?
Advertisement

Nithin – Ram: వరుస పరాజయాల నీడలో ఉన్న యువ హీరోలు నితిన్, రామ్ పోతినేని తమ కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పరాజయాల తర్వాత వచ్చే ఒత్తిడిని తట్టుకుని, సరైన కథను ఎంచుకోవడం ఏ హీరోకైనా ఒక సవాల్‌తో కూడుకున్న పనే. అందులో బాగానే వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ (Nithin) తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించగా, రామ్( Hero Ram) తన తదుపరి అడుగు కోసం.. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరి సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు

నితిన్-విఐ ఆనంద్ క్రేజీ కాంబో:

నితిన్ విషయానికి వస్తే.. వరుసగా ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో నితిన్ ఈసారి తన పంథా మార్చుకున్నారు. వైవిధ్యమైన కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు విఐ ఆనంద్‌తో చేతులు కలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను (Nithiin 36) ఒక హై-కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా మేకర్స్ ప్రకటించారు. “వాస్తవ నిబంధనలు ఇప్పుడే మారిపోయాయి” అంటూ విడుదల చేసిన పోస్టర్ నితిన్ ఊరమాస్ లుక్‌ను ప్రదర్శిస్తూ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఒకే సినిమాలో నితిన్ రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇన్ని రోజులు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కి ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందంటూ కామెంట్లు వెలువబడుతున్నాయి.

రామ్ పోతినేని ‘వెయిటింగ్ గేమ్:

Advertisement

ఇదే సమయంలో హీరో రామ్ గురించి ప్రస్తావన కూడా తెరపైకి వచ్చింది. అయితే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. భారీ అంచనాలతో వచ్చిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రామ్ తన తదుపరి సినిమా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. స్క్రిప్ట్ వంద శాతం లాక్ అయితే తప్ప అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి కథా చర్చల్లో పాల్గొంటున్నారు. మాస్ మరియు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించే బలమైన కథ కోసం రామ్ చేస్తున్న ఈ నిరీక్షణ, ఒక సాలిడ్ హిట్ కోసమేనని చిత్ర పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ALSO READ:Tollywood: అధ్యాయం ముగిసింది.. విడాకులు ప్రకటించిన ప్రముఖ జంట!

ఓటమి ఎదురైనప్పుడే.. అసలైన విజయం తలుపు తడుతుంది..

Advertisement

ఏ హీరోకైనా గెలుపోటములు సహజమే అయినా, వరుసగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడు చేసే ప్రయోగాలే వారి అసలు సిసలు సత్తాను నిరూపిస్తాయి. నితిన్ తన 36వ సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి రావాలని చూస్తుంటే, రామ్ తన ఎనర్జీకి తగ్గ సరైన సబ్జెక్ట్ కోసం వెతుకుతున్నారు. ఇద్దరు హీరోలు కూడా తమ బలహీనతలను విశ్లేషించుకుని, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మారేందుకు సిద్ధమయ్యారు. విభిన్నమైన జానర్లలో సినిమాలు చేస్తూ మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని చాటుకుంటారని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ కొత్త ప్రయత్నాలు వీరిద్దరికీ టర్నింగ్ పాయింట్లు కావాలని ఆశిద్దాం.ఓటమి విజయానికి తొలిమెట్టు అంటారు. వరుస ఫ్లాపులు వీరిద్దరినీ మరింత పరిణతి చెందిన నటులుగా మారుస్తాయని, రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద గర్జిస్తారని కోరుకుందాం.

Related News

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

లిటిల్ హార్ట్స్‌కు భారీ లాభాలు.. కానీ నాకు మాత్రం.. మౌళి షాకింగ్ కామెంట్స్ !

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. సాయి పల్లవి స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయొద్దంటూ!

నటి అతుల్య చంద్ర ఫిర్యాదులో బయటపడ్డ సంచలన నిజాలు!

బాలయ్య రోజూ తెల్లవారుజామున 3 గంటలకే లేస్తారు.. కారణం ఇదే!

500 సినిమాలు చేశా.. కానీ నా పేరు చాలామందికి తెలియదు..ల్యాబ్ శరత్!

Big Stories

Advertisement
×