E-Paper
Advertisement

మీ రాజకీయాల కోసం రైతులతో ఆటలా.. మంత్రి జూపల్లి ఫైర్!

మీ రాజకీయాల కోసం రైతులతో ఆటలా.. మంత్రి జూపల్లి ఫైర్!
Advertisement

Jurala Water: జూరాల నీటి విషయంలో రైతులను తప్పుదోవ పట్టించొద్దని, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా కొందరి తీరు కనిపిస్తోందని మంత్రి జూపల్లి కృష్టారావు అన్నారు. ఒక టీఎంసీ నీటికి ఎంత బాష్పీభవనం (ఆవిరి) జరుగుతుంది? ప్రాజెక్టులో ఎంత నీరు అందుబాటులో ఉంది? ఇన్‌ఫ్లో ఎంత వస్తోంది? అవుట్‌ఫ్లో ఎంత ఉంది? కర్ణాటకలో వర్షపాతం, అక్కడి ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? అనే వాస్తవాలను పరిశీలించకుండా మాట్లాడటం సరికాదని మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు.

తప్పుదోవ పట్టించేలా..

రైతులను కాపాడుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. కావాలంటే జూరాల నీటి లెక్కలను అధికారులతో కలిసి పరిశీలించండని అన్నారు. వాస్తవాలు తెలుసుకోండి. రైతులను తప్పుదోవ పట్టించేలా రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల ఒక్క చుక్క నీరు కూడా పెరగదని అన్నారు. కర్ణాటక నుంచి వచ్చే నీటిపై కూడా వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని, వర్షాలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, విడుదల వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి నిర్వహణ చేయాల్సి ఉంటుందని అన్నారు.

Advertisement

Also read: ఈసారి శాంసంగ్ కొనేవారికి పండగే పండగ.. Galaxy S25 సిరీస్‌పై భారీ ఆఫర్లు!

మంత్రి జూపల్లి క్లారిటీ..

తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అన్యాయం చేయడం లేదు. రైతుల పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడటానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ నీటి లభ్యతపై వాస్తవాలు చెప్పకుండా హడావుడి చేయడం, రైతుల్లో ఆందోళన కలిగించడం బాధ్యతారాహిత్యం అని మంత్రి జూపల్లి క్లారిటీ ఇచ్చారు.

నీటిని పొదుపుగా..

Advertisement

నీటి విషయంలో రాజకీయాలు కాదువాస్తవాలు, లెక్కలు, శాస్త్రీయ విధానం ముఖ్యం. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పంటలను కాపాడుకునేలా ప్రభుత్వం అవసరమైన సూచనలు, చర్యలు తీసుకుంటుందని, రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని, రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి క్లారిటీ ఇచ్చారు.

Also read: ‘ది ప్యారడైజ్’ లో మోహన్ బాబు పాత్ర అంత భయంకరంగా ఉంటుందా?

Tags

Related News

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మాజీ ఎంపీ సంతోష్ రావు ఆస్తులపై విచారణ..?

కృష్ణా నీటి వాటాపై సంచలన నిజాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్!

దుండిగల్ మున్సిపాలిటీలో మహిళలకు దారుణం.. 12 పబ్లిక్ టాయిలెట్లకు తాళాలు!

ఇరిగేషన్ ఆఫీస్‌కు కోర్టు బిగ్ షాక్.. ప్రభుత్వ ఆఫీస్ జప్తుకు ఆదేశాలు జారీ!

SC/ST అట్రాసిటీ చట్టంపై సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ!

Big Stories

Advertisement
×