E-Paper
Advertisement

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!
Advertisement

Telangana Rising: స్వేచ్ఛ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ఫ్యూచర్ సిటీలోని స్కిల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. సమ్మిట్‌ నిర్వహణకు సంబంధించి యూనివర్సిటీలో జరుగుతున్న పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అవసరమైన మెటీరియల్‌, మ్యాన్‌పవర్‌ నియామకం, పనుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి షెడ్యూల్‌ ఖరారు చేసినట్లు చెప్పారు. సమ్మిట్‌కు అవసరమైన అన్ని మౌలిక వసతుల పనులతో పాటు రోడ్లు, డ్రైనేజీలు, తదితర పనులను అక్టోబర్‌ 31లోగా పూర్తి చేసి సమ్మిట్‌ టీమ్‌కు అప్పగిస్తామని మంత్రి తెలిపారు.

గ్లోబల్ సమ్మిట్‌..

సమ్మిట్‌ నిర్వహణకు ముందు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ బృందానికి అవసరమైన సమయం ఉండేలా పనులను ముందుగానే పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.సమ్మిట్‌ కోసం 6 సెమినార్‌ హాళ్లను సిద్ధం చేస్తున్నామని, వీటితో పాటు మూడు పెద్ద హాళ్లు, మరో 10 చిన్న హాళ్లను కూడా సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు. సమ్మిట్‌లో నిర్వహించే వివిధ సమావేశాలు, సెమినార్లు, ఇతర కార్యక్రమాలకు అనుగుణంగా ఈ హాళ్లను వినియోగించనున్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్‌ కోసం చేసే ఏర్పాట్లు, నిర్మించే మౌలిక వసతులు సమ్మిట్‌ అనంతరం కూడా ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. సమ్మిట్‌ పూర్తయిన అనంతరం ఈ భవనాలు, మౌలిక వసతులను స్కిల్‌ యూనివర్సిటీకి అప్పగిస్తామని మంత్రి తెలిపారు.

Advertisement

Also read: ‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదం.. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కాంగ్రెస్‌ వైఖరిపై ధ్వజం!

ఫిబ్రవరి నాటికి..

54 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్‌ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. యూనివర్సిటీ భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడేలా సమ్మిట్‌ కోసం చేపడుతున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నట్లు మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. యూనివర్సిటీలో బాయ్స్‌ హాస్టల్‌, గర్ల్స్‌ హాస్టల్‌, డైనింగ్‌ హాల్‌ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. వీటిని వేగంగా పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరి నాటికి స్కిల్‌ యూనివర్సిటీలో కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.

గిగ్‌ వర్కర్‌ కొండల్‌రెడ్డికి అండగా ప్రభుత్వం..

Advertisement

గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ వర్కర్‌ కొండల్‌రెడ్డి చికిత్సకు ప్రభుత్వం అండగా నిలిచింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న కొండల్‌రెడ్డికి రూ.2,77,500 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తన చేతుల మీదుగా అందజేశారు. గత 9 సంవత్సరాలుగా ఉబర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న కొండల్‌రెడ్డి అనారోగ్యం కారణంగా ప్రస్తుతం పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొండల్‌రెడ్డికి పాఠశాలకు వెళ్లే ఇద్దరు కుమార్తెలు ఉండగా, కుటుంబానికి ఆయనే ఏకైక ఆదాయ వనరుగా ఉన్నారు. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందించిందని మంత్రి తెలిపారు.

Also read: వాయిదా పడ్డ ‘ఆదర్శ కుటుంబం-AK47’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Tags

Related News

రేపు తెలంగాణకు భారీ వానగండం.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

ఇక స్మార్ట్ సిటీగా నల్గోండ జిల్లా.. మంత్రి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం!

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

ఏసీబీకి చిక్కిన మంచిర్యాల గ్రామ పరిపాలనా అధికారి!

ప్రభుత్వ వైద్యం దయనీయం.. చిన్నారుల చావుల్లోనూ నిర్లక్ష్యమా?.. కవిత తీవ్ర ఆగ్రహం!

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పాపాల పుట్ట బద్దలు.. ఏసీబీ దాడుల్లో సంచలనాలు!

‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదం.. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కాంగ్రెస్‌ వైఖరిపై ధ్వజం!

Big Stories

Advertisement
×