E-Paper
Advertisement

Gv Prakash : మోసపోయిన జీవీ ఆ పని ఆపలేదు.. ఎంతైన హీరో గ్రేట్ అంతే..

Gv Prakash : మోసపోయిన జీవీ ఆ పని ఆపలేదు.. ఎంతైన హీరో గ్రేట్ అంతే..
Advertisement

Gv Prakash : కోలీవుడ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఒక్కో సినిమాతో టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఈ హీరో సాయం అడిగిన వాళ్లకు లేదనకుండా సాయం చేస్తారన్న విషయం తెలిసిందే.. ఎంతోమందికి సాయం చేశారు.. రీసెంట్ గా ఈయన ఒకరి చేతిలో మోసపోయినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.. కానీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ జీవీ ఏం చేశారో ఒకసారి తెలుసుకుందాం..

మోసపోయిన ఆపని సాయం..

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈయన ఈ మధ్య తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఒకవైపు సినిమాలతో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటున్నారో, సామాజిక దృక్పధంతో చేస్తున్న సేవల కారణంగా రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓ అభిమాని సాయం అడిగారు.. అయితే ఏంటి అనేది తెలుసుకోకుండా వెంటనే డబ్బులను పంపి మంచి మనసు చాటుకున్నాడు. తన కుటుంబంలో ఒకరికి సర్జరీ ఉందని, డబ్బులు కావాలని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన జీవీ అతనికి రూ. 50 వేలు పంపించి మంచి మనసు చాటుకున్నాడు..ఈ ట్యాలెంటెడ్ హీరోపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.. మోసపోయిన ఆయన సాయం చెయ్యడం ఆపలేదు.. అది అతని మంచి తనానికి నిదర్శనం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు కన్నీళ్లు.. పల్లవి ప్లాన్ సక్సెస్.. మీనాక్షి చనిపోయిందా..?

గతంలో ఏం జరిగిందంటే..? 

తమిళ హీరో జీవీ ప్రకాష్ అడిగిన వారికి లేదనుకుండా సాయం అందుస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు ఆయన నెటిజన్లకు సాయం అందించారు. అయితే ఓ నెటిజన్ కూడా తల్లికి ఆరోగ్యం బాగోలేదని నమ్మించి డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత రెస్పాండ్ అవ్వకపోవడంతో తానే స్వయంగా తనని ఫ్రాడ్ చేశారని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. అది మరువక ముందే ఈ హీరో మరోసారి సాయం చెయ్యడం పై సర్వత్రా మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదేమీ మనసులో పెట్టుకోకుండా జీవీ ప్రకాశ్ కుమార్ ఓ నెటిజన్ కు సాయం చేశాడు..ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. తెలుగులో అనిల్ రావిపూడి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతోపాటుగా తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నారు.. మొత్తానికి ఈ హీరోగా బిజీగా ఉన్నారు.

Advertisement

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×