Viral News: వాడో దొంగ. ఇంటికి వెళ్లడానికి విమానం ఎక్కాలని అనుకున్నాడు. కానీ, టికెట్ రేటు ఎక్కువ ఉండటంతో ఆన్ రోడ్ వెళ్లేందుకు ఒక కారు దొంగతనం చేశాడు. అందులో పెట్రోల్ అయిపోగానే దాన్ని పక్కన వదిలేసి ఇంకో కారును దొంగతనం చేశాడు. అందులో కూడా పెట్రోల్ అయిపోయాక ఇంకో కారు. అలా 8 కార్లు దొంగతనం చేసి ఇంటికి చేరాడు. చివరకు ఏం జరిగిందంటే..
ఇంతకీ అసలు కథ ఏంటంటే?
చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్ కు చెందిన చెన్.. సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో ఉంటున్నాడు. అతడు తన సొంతూరికి వెళ్లాలని భావించాడు. మే 31న విమానం టికెట్ బుక్ చేశాడు. కానీ, దాని ఖరీదు చాలా ఎక్కువగా ఉండటంతో క్యాన్సిల్ చేశాడు. పైసా ఖర్చు లేకుండా ఇంటికి చేరుకోవాలి అనుకున్నాడు. ఎలా? అని ఆలోచించాడు. చివరకు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.
8 కార్లు దొంగతనం చేసి.. ఇంటికి చేరి..
విమానంలో వెళ్లడం కుదరకపోవడంతో కారులో ప్రయాణం చేయాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే రాత్రి పూట అన్ లాక్ చేయబడిన కార్ షో రూమ్ లోకి వెళ్లి క్యాబినెట్‌ల నుండి కీస్ తీసుకునే వాడు. సర్వీస్ కోసం ఉన్న కారును తీసుకుని పారిపోయేవాడు. ఎవరూ లేని కారు పార్కింగ్ ల లోకి చొరబడి, పాత మోడల్ కారును ఎంచుకుని, ఇగ్నిషన్ ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా వాటిని స్టార్ట్ చేసేవాడు. జూన్ ప్రారంభం నుంచి కార్లు దొంగతనం చేస్తూ చెన్ ఏడు నగరాల మీదుగా సొంతూరుకు చేరుకున్నాడు. ఒక కారు దొంగతనం చేసి.. దానిలో ప్రయాణించేవాడు. దానిలో పెట్రోల్ అయిపోగా అక్కడ వదిలేసి, మరో కారును దొంగతనం చేసి, అందులో ప్రయాణించాడు. అలా తన సొంతూరుకు వెళ్లే వరకు 8 కార్లు దొంగతనం చేశాడు.
Read Also: ఏపీ నుంచి యూపీకి వెళ్లేందుకు మూడేళ్లు.. దేశంలోనే అత్యంత ఆలస్యమైన రైలు ఇదే!
పోలీసులకు ఎలా చిక్కాడంటే?
జూన్ 2న, వుహాన్ లోని ఒక షోరూమ్ సిబ్బంది తమ గ్యారేజ్ లోని విలువైన కారు దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కారులో ట్రాకర్ ఉంది. ఆ కారును ట్రాక్ చేసినప్పుడు ఆ కారు వుహాన్ నుంచి నార్త్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. మరుసటి రోజు హెబీ ప్రావిన్స్ లో చెన్ మరొక కారును దొంగిలించడానికి ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టారు. అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. జూన్ 4న, హెబీలోని ఒక కార్ పార్కింగ్ లో చెన్ ఓ కారులో నిద్రపోతున్నట్లు పోలీసులు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. అతడు దొంగిలించడిని కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో చెన్ కు సుమారు 10 ఏండ్ల శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Read Also: ఇంకా IRCTC అకౌంట్ కు ఆధార్ లింక్ చెసుకోలేదా? టికెట్లు బుక్ చెయ్యలేరు!