Water Management: స్వేచ్చ బ్యూరో: ఉత్తమ నీటి నిర్వహణపై ఢిల్లీలో తనకు ప్రసంగించే అవకాశం లభించడంతో జాతీయస్థాయిలో జోగులాంబ గద్వాల జిల్లా ఖ్యాతి ఇనుమడించిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈ నెల 20-26వ తేదీ వరకు కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ లో ఈనెల 24న కలెక్టర్ పాల్గొని వచ్చిన నేపథ్యంలో శుక్రవారం జిల్లా అధికార యంత్రాంగం తరపున పలువురు అధికారులు ఐడిఓసి లోని చాంబర్ లో జిల్లా కలెక్టర్ ను సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి వనరులను సంరక్షించుకునేందుకు ప్రణాళికలు రూపొందించడమే కాక వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున ఉన్న నీటి వనరులను కాపాడుకునేందుకు ప్రజల భాగస్వామ్యంతో చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, డిపిఓ శ్రీకాంత్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, డిఐఈఓ హృదయ రాజ్, తదితరులు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
Also read: హ్యాకర్ల టార్గెట్‌గా గూగుల్ క్రోమ్ యూజర్లు? CERT-In బిగ్ వార్నింగ్.. వెంటనే ఇలా చేయండి!