IND VS WI: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ (Ind Vs WI ) మధ్య జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ శుభమాన్ గిల్ (Gill), రోహిత్ శర్మ (Rohit Sharma) ఇద్దరూ సెంచరీలు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే తొలి వన్డేలో ఇరగదీసిన గిల్… రెండు వన్డే లోనూ 63 బంతుల్లో సెంచరీ ఫినిష్ చేశాడు. అటు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 73 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 సిక్సర్లు, 10 బౌండరీలు బాదేశాడు.
వెస్టిండీస్ తో (West Indies) జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాట్ జులిపించాడు. ఈ క్రమంలోనే వన్డే క్రికెట్లో 12,000 పరుగుల మైలురాయిని విజయవంతంగా ఫినిష్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 73 పరుగులు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. 12000 పరుగుల మార్క్ అందుకున్నాడు. కేవలం 282 ఇన్నింగ్స్ లలో ఈ మార్క్ అందుకోవడం గమనార్హం. 242 ఇన్నింగ్స్ లలో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న వేగవంతమైన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ( Virat Kohli) మొదటి స్థానంలో ఉండగా… రెండో స్థానంలో రోహిత్ శర్మ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఈ పన్నెండు వేల పరుగులను పూర్తి చేసేందుకు 300 ఇన్నింగ్స్ లు ఆడాల్సి వచ్చింది.