E-Paper
Advertisement

ది ప్యారడైజ్ ఫస్ట్ చాయిస్ కయాదు కాదా? ఆమె రిజెక్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చిందా?

ది ప్యారడైజ్ ఫస్ట్ చాయిస్ కయాదు కాదా? ఆమె రిజెక్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చిందా?
Advertisement

The Paradise Movie: నాచురల్ స్టార్ నాని (Nani)హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఒకవైపు ఈ సినిమాకు బాగా నెగిటివిటీ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాలో నాని జడల్ అనే పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా కయాదు లోహర్(Kayadu Lohar) సుబ్బు అనే పాత్రలో నటించారు.

ప్యారడైజ్ ఫస్ట్ ఛాయిస్ జాన్వీ కపూర్..

ఇలా ఈ సినిమాలో కయాదు నటించిన సుబ్బు (Subbu)పాత్రకు కూడా మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే ఈ సినిమాలో సుబ్బు పాత్ర కోసం ముందుగా చిత్రబృందం కయాదును ఎంపిక చేయలేదట . వేరొక హీరోయిన్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతో తిరిగి చిత్ర నిర్మాతలు ఈమెను ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి మొదటగా సుబ్బు పాత్ర కోసం చిత్ర బృందం సంప్రదించిన హీరోయిన్ ఎవరు? ఆమె ఎందుకు రిజెక్ట్ చేశారు? అనే విషయానికి వస్తే.. ఈ సినిమాలో సుబ్బు పాత్ర కోసం ముందుగా చిత్ర నిర్మాతలు ప్రముఖ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) ను సంప్రదించారని తెలుస్తోంది.

కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవటమే కారణమా..

Advertisement

జాన్వీ కపూర్ దేవర సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈమె తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ది ప్యారడైజ్ సినిమా కోసం కూడా మేకర్స్ ఈమెను సంప్రదించడంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే జాన్వీ కపూర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది(Peddi) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ప్యారడైజ్ సినిమాని ఈమె రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఈ విధంగా జాన్వీ తప్పుకోవడంతో సుబ్బు పాత్ర కోసం కయాదు లోహర్ ఎంపిక అయ్యారు.

కలెక్షన్ల విషయంలో దూసుకుపోతున్న ప్యారడైజ్…

ఇక ఈమె కూడా ఇదివరకు పలు తెలుగు సినిమాలలో నటించారు కానీ పెద్దగా సక్సెస్ మాత్రం రాలేకపోయింది. ఇక ప్యారడైజ్ సినిమా పరవాలేదనిపించింది. మరోవైపు జాన్వి కపూర్ సైతం తెలుగులో దేవర ,పెద్ది సినిమాలలో నటించారు ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి కానీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. ఇక పెద్ది తర్వాత జాన్వీ ఎలాంటి తెలుగు సినిమాలకు కమిట్ అవ్వలేదు. ఇక ప్యారడైజ్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో కయాదుకు తదుపరి సినిమా అవకాశాలు ఎలా ఉంటాయనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రెండు రోజులకు ఏకంగా 114 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.

Advertisement

Also Read: హీరో కాకపోతే నాని ఆ పని చేసేవాడా? చెప్తే లాజిక్ ఉండాలి బ్రో!

Related News

‘డోరతీ’ సినిమాలో కీర్తి సురేష్ ఇంటిమేట్ సీన్.. సోషల్ మీడియాలో నిరసన సెగ!

చిరు – శ్రీకాంత్ ఓదెల సినిమా అటకెక్కినట్టేనా ?

పెళ్లి కావాలి, పిల్లలు వద్దు.. గర్భసంచి అవసరం లేదు: స్నిగ్ధ!

హీరో కాకపోతే నాని ఆ పని చేసేవాడా? చెప్తే లాజిక్ ఉండాలి బ్రో!

సుమలత వల్లే ఇన్ని సమస్యలు.. డాన్సర్స్ సమావేశంలో సీనియర్ మాస్టర్స్ ఫైర్!

మరో వివాదంలో ది ప్యారడైజ్..సమ్మక్క పాత్రను అవమానించారంటూ?

జూహీ చావ్లా ఆస్తులు డబుల్.. ఒక్క ఏడాదికి అన్ని కోట్లా..?

Big Stories

Advertisement
×