E-Paper
Advertisement

పైలట్ నుంచి మద్యం వాసన.. ఎయిర్ ఇండియా షాకింగ్ డెసిషన్!

పైలట్ నుంచి మద్యం వాసన.. ఎయిర్ ఇండియా షాకింగ్ డెసిషన్!
Advertisement

Air India Pilot Suspended: విమానం టేకాఫ్‌ కు సిద్ధమవుతున్న సమయంలో పైలట్‌ పై అనుమానం రావడంతో ఎయిర్ ఇండియా సిబ్బంది అప్రమత్తమయ్యారు. జూరిచ్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని నడపాల్సిన పైలట్ నుంచి మద్యం వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం నిర్వహించిన బ్రీత్‌ లైజర్ పరీక్షలో పైలట్ ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో అతడిని  సస్పెండ్ చేశారు.

విమానం బయలుదేరే ముందు ఘటన!

ఈ ఘటన సెప్టెంబర్ 6న జూరిచ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఆ రోజు AI151 విమానం జూరిచ్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. విమానం నడిపేందుకు సిద్ధమవుతున్న కాక్‌ పిట్ సిబ్బందిలో ఒక పైలట్ నుంచి మద్యం వాసన వచ్చినట్లు ఎయిర్ ఇండియా సిబ్బంది గుర్తించారు. వారు స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం పైలట్‌కు ప్రాథమిక బ్రీత్‌లైజర్ పరీక్ష నిర్వహించగా, అందులో అతడు ఫెయిట్ అయ్యాడు.

వెంటనే విధుల నుంచి తొలగింపు!

Advertisement

ప్రాథమిక పరీక్ష నివేదిక అందిన వెంటనే సదరు పైలట్‌ను  విధుల నుంచి తప్పించినట్లు ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి తెలిపారు. అనంతరం అతడిని మరింత వైద్య పరీక్షలకు పంపించారు. వైద్య పరీక్షలు, దర్యాప్తు పూర్తయ్యే వరకు పైలట్ సస్పెన్షన్‌ లోనే ఉంటాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణలో వెలువడే అంశాల ఆధారంగా తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

వరుసగా రెండో ఘటన

కొద్ది వారాల క్రితం ఎయిర్ ఇండియా కాక్‌పిట్ సిబ్బందికి సంబంధించి ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇది రెండోసారి. అంతకుముందు ఫుకెట్ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానానికి సంబంధించిన పైలట్‌పై కూడా మత్తు పదార్థాల పరీక్ష నిర్వహించారు. ఆగస్టు 4న జరిగిన ఘటనలో విమానం సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందికి దిగిపోయింది. ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. అనంతరం పైలట్‌కు నిర్వహించిన పరీక్షలో మద్యం తాగినట్లు తేలడంతో అతడిని విధుల నుంచి తప్పించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

భద్రతపై మరింత ఫోకస్

Advertisement

వరుస ఘటనల నేపథ్యంలో విమానయాన సంస్థ తన అంతర్గత భద్రత, నియమాల అమలును మరింత కట్టుదిట్టం చేస్తోంది. మద్యం, నిషేధిత పదార్థాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం కొనసాగుతుందని ఫ్లైట్ ఆపరేషన్స్ విభాగం పైలట్లకు స్పష్టం చేసింది. సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్, హెచ్‌ఆర్ అధికారులు కాక్‌పిట్ సిబ్బందితో ప్రత్యక్షంగా మాట్లాడే సమయాన్ని పెంచనున్నట్లు తెలుస్తోంది.

పరీక్షలు మరింత కఠినతరం  

మత్తు పదార్థాల కోసం నిర్వహించే తప్పనిసరి పరీక్షలను మరింత బలోపేతం చేయడంతో పాటు, సిబ్బందికి మరింత  శిక్షణ ఇవ్వాలని ఎయిర్ ఇండియా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై పర్యవేక్షణను కూడా పెంచుతున్నట్లు వెల్లడించారు. మద్యం, నిషేధిత పదార్థాలకు సంబంధించిన ఉల్లంఘనలు రుజువైతే ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది.

Read Also: బర్త్ టూరిజానికి గట్టి భారీ షాక్.. అమెరికా కొత్త వీసా రూల్స్!

Tags

Related News

కారుపై ‘L’ అని ఉందా? ఈ ట్రాఫిక్ రూల్స్ మీకు తెలియకపోతే నష్టం తప్పదు!

పండుగ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖకు ప్రత్యేక రైళ్లు!

భారతీయులకు ఉచిత వీసా ఇస్తున్న మలేషియా.. కానీ ఉద్యోగం చేయాలంటే ఈ కండీషన్స్ తప్పనిసరి

దసరా, దీపావళికి రైల్వే గుడ్‌న్యూస్.. 102 స్పెషల్ రైళ్లు!

బర్త్ టూరిజానికి గట్టి భారీ షాక్.. అమెరికా కొత్త వీసా రూల్స్!

రైలు అద్దం నుంచి బుల్లెట్‌లా దూసుకొచ్చిన రాయి.. దురంతోపై దాడి? ఇదిగో ఆ షాకింగ్ వీడియో!

రైలులో సైకో కిల్లర్.. ఖాకీ దుస్తుల్లో వచ్చి డ్రామాలు.. ప్రయాణికులను బయటకు తోసేస్తూ దారుణాలు!

Big Stories

Advertisement
×