E-Paper
Advertisement

నాని ‘ప్యారడైజ్’కి తొలిరోజే రూ.100 కోట్లా?ఆశకు హద్దుండాలి గురూ !

నాని ‘ప్యారడైజ్’కి తొలిరోజే రూ.100 కోట్లా?ఆశకు హద్దుండాలి గురూ !
Advertisement

Paradise Collections:ప్యారడైజ్ సినిమాకి మరికొద్ది గంటల్లో ప్రీమియర్లు పడబోతున్నాయి. దీంతో ఇపుడు ఎక్కడ చూసినా ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది.అదే ఈ సినిమా మొదటి రోజే ఏకంగా వంద కోట్లు కొట్టబోతుందని.వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు బట్టి నిజంగానే నిజం అవుతుందా ఏంటీ అంటూ కొందరు లెక్కలు వేస్తుంటే “ఏంటీ.. సినిమా ఇంకా థియేటర్లలోకి రాలేదు.. అప్పుడే వంద కోట్లా?” అంటూ మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు.

సినిమాపై విపరీతమైన బజ్

Advertisement

నిజానికి దసరా సినిమా తర్వాత అదే కాంబోలో సినిమా వస్తుండటంతో అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. దానికి తోడు నాని ఈసారి మాస్ లుక్‌లో కనిపించనుండటం, భారీ యాక్షన్ సీన్స్, అనిరుధ్ సంగీతం, రాఘవ్ జుయల్ విలన్‌గా నటించడం.. ఇలా సినిమాపై విపరీతమైన బజ్ పెరిగిపోయింది.

ఇక సినిమాకి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వందకోట్ల వైపు ఆలోచించేలా చేస్తున్నాయి. అవును మరి…ఎప్పుడు లేనంతగా ఓవర్సీస్‌లో ఏకంగా అప్పుడే మిలియన్ డాలర్ మార్క్ దాటినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇక ఇటు ఇండియాలో కూడా బుకింగ్స్‌కు సాలిడ్ రియాక్షన్ వస్తుండటంతో తొలి రోజే ఊహించని వసూల్లని వెనకేస్తుంది అంటూ లెక్కలు వేస్తున్నారు నాని ఫ్యాన్స్.

Advertisement

ఆశకి కూడా హద్దు ఉండాలి

ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఏకంగా తొలిరోజు రూ.60 కోట్ల వరకు గ్రాస్ రావచ్చని ,సినిమా టాక్ బాగుంటే ఈ లెక్క రూ.70కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.అయితే ఈ లెక్కలు 60,70లలో ఉంటే నెట్టింట్లో మాత్రం ఈ ఓపెనింగ్ నెంబర్ ని ఏకంగా వందకోట్లకి చేర్చేయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.దీంతో పెద్ద సినిమాలకే వంద కోట్ల వసూళ్లు రాలేవు .ఎంత బాజ్ ఉన్నా నాని సినిమాకి అంత నెంబర్ రావడం అంటే అంత ఆషామాషీ కాదు.అయినా ఆశకి కూడా హద్దు ఉండాలి అంటూ కౌంటర్లు వేస్తున్నారు యాంటి ఫ్యాన్స్.

అయితే ‘ది ప్యారడైజ్’కు ఉన్న హైప్‌ను మాత్రం తక్కువగా తీసుకోలేం. ‘దసరా’తో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే స్థాయిలో మాస్‌గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. నాని కూడా ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇందులో చాలా రఫ్‌గా, కొత్త లుక్‌లో కనిపించనున్నాడనే ప్రచారం సినిమాపై ఆసక్తిని పెంచింది.

సినిమాపై క్యూరియాసిటీ

‘హిట్: ది థర్డ్ కేస్’ తర్వాత నాని యాక్షన్ సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో మరోసారి భారీ యాక్షన్‌ ఉండబోతుంది అని గ్లిమ్ప్స్  తేల్చేయడంతో ఓపెనింగ్‌పై అంచనాలు పెరిగాయి.మోహన్ బాబు శికంజా మాలిక్ గా కనిపిస్తుండగా రాఘవ్ జుయల్ కూడా ఈ సినిమాలో విక్రం మాలిక్ గా కనిపించనున్నాడు.

‘కిల్’ తర్వాత అతడికి యాక్షన్ ఇమేజ్ రావడంతో ఈ సినిమాలో నాని, రాఘవ్ మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉంటాయా అని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్ ,మరో వైపు సంపూర్ణేష్ బాబు కూడా తనకు అలవాటైన కామెడీ పాత్రలో కాకుండా బిర్యానీ అనే సీరియస్ రోల్ పోషించడంతో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

లెక్కలన్నీ అంచనాలు మాత్రమే

అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న రూ.75 కోట్లు, రూ.80 కోట్లు, రూ.100 కోట్ల లెక్కలన్నీ అంచనాలు మాత్రమే. అసలు లెక్క సినిమా రిలీజ్ మొదటి రోజు మార్నింగ్ షో పడ్డ తర్వాతే తెలుస్తుంది.అయితే ‘ది ప్యారడైజ్’పై ఇంత పెద్ద స్థాయిలో ఓపెనింగ్ చర్చ జరుగుతుండటం మాత్రం నాని క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెబుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ బుకింగ్స్, ఇండియా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఈ సినిమా నాని కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్ అందుకునే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.

also read :తరుణ్‌కు భారీ హిట్.. ఏవీఎస్‌కు మరో టెన్షన్! ‘అంకుల్’ వెనుక కథ ఇదేనా?

ఇక “తొలిరోజే వంద కోట్లు వస్తాయా?” అనే ప్రశ్నకు సమాధానం మాత్రం థియేటర్లలోనే దొరుకుతుంది. అప్పటివరకు సోషల్ మీడియాలో లెక్కలు మాత్రం ఆగేలా కనిపించడం లేదు.

Tags

Related News

అక్కినేని కోడలు క్రేజ్ మాములుగా లేదుగా… ఏకంగా

జానీ మాస్టర్ భార్య పై దాడి..పోలీసులను ఆశ్రయించిన సుమలత!

వెళ్ళడానికి వీళ్లేదు..నానికి పోలీసులు బిగ్ షాక్!

తరుణ్‌కు భారీ హిట్.. ఏవీఎస్‌కు మరో టెన్షన్! ‘అంకుల్’ వెనుక కథ ఇదేనా?

13 ఏళ్ల ప్రేమకు బ్రేక్.. విడిపోతున్న స్టార్ కపుల్..?

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజాకు అరుదైన గౌరవం!

16 ఏళ్ల కష్టానికి నేనే సాక్ష్యం.. నాని వైఫ్ అంజనా పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×