E-Paper
Advertisement

సిరిసిల్లలో అడుగుపెట్టే ముందు ఇవి తేల్చు.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ బహిరంగ సవాల్!

సిరిసిల్లలో అడుగుపెట్టే ముందు ఇవి తేల్చు.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ బహిరంగ సవాల్!
Advertisement

KTR: సిరిసిల్ల పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటైన బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతే అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

భూ ఆరోపణలపై శ్వేతపత్రం డిమాండ్

Advertisement

సిరిసిల్లలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించారని, అందులో 2400 ఎకరాలను తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని సీఎం అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ఆ 2400 ఎకరాల భూ రికవరీకి సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.

నేత కార్మికుల బకాయిలు.. బతుకమ్మ చీరలు

Advertisement

సిరిసిల్ల నేతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ఎందుకు నిలిపివేశారో స్పష్టం చేయాలని నిలదీశారు. అంతేకాకుండా సిరిసిల్ల నేత కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.60 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు.

రైతు సంక్షేమంపై నిలదీత

రైతులకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ అమలులో జరిగిన లొసుగులు, ఎగ్గొట్టిన రైతు భరోసా బకాయిల విధానంపై పూర్తి స్పష్టత ఇచ్చిన తర్వాతే సీఎం సిరిసిల్లలో పర్యటించాలని పేర్కొన్నారు.

రాజకీయ సంస్కృతి మారాలి

రాష్ట్రాన్ని నడిపించే ఒక బాధ్యతయుతమైన సీఎం పదవిలో ఉండి, పర్యటించిన ప్రతిచోట బూతు పురాణాలు మాట్లాడుతూ బురదజల్లే సంస్కృతి మంచిది కాదని కేటీఆర్ హితవు పలికారు. సిరిసిల్ల గడ్డపై అలాంటి చౌకబారు విమర్శలు మానాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Also Read: కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మంత్రి పదవుల పంపకం.. బీఆర్‌ఎస్‌పై ఎంపీ అరవింద్ సెటైర్లు!

Tags

Related News

కేటీఆర్‌ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వారెవ్వా ఏం టాలెంట్.. ఓ విద్యార్ధి చేసిన పనికి అధికారులంతా షాక్!

బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. రూ. 442 కోట్ల ఆస్తుల జప్తు!

హైదరాబాద్ సైబర్ క్రైమ్.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కే రూ. 14.61 కోట్ల టోకరా!

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మంత్రి పదవుల పంపకం.. బీఆర్‌ఎస్‌పై ఎంపీ అరవింద్ సెటైర్లు!

ఆర్మీ ఆయుధాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్.. ఎలా దొంగతనం చేశాడంటే..

తెలంగాణ జనసేనలో బిగ్ చేంజ్.. కొత్తగా చేరేవారికి పవన్ కళ్యాణ్ మాస్ కండిషన్స్!

Big Stories

Advertisement
×