E-Paper
Advertisement

రిలయన్స్ డిజిటల్ సంచలనం.. iPhone 17 Proపై ఏకంగా రూ.77,000 తగ్గింపు!

రిలయన్స్ డిజిటల్ సంచలనం.. iPhone 17 Proపై ఏకంగా రూ.77,000 తగ్గింపు!
Advertisement

iPhone 17 Pro Price Drop: ఐఫోన్ 18 సిరీస్ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే.. ఐఫోన్ 17 ప్రో ధర పాతాళానికి పడిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా రిలయన్స్ డిజిటల్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ.1,34,900గా ఉన్న ఐఫోన్ 17 ప్రో 256జీబీ వేరియంట్ ఇప్పుడు కేవలం రూ.56,990కే లభిస్తోంది. అంటే.. ఏకంగా రూ.77,910 వరకు తగ్గింపు అన్నమాట. ఇంత తక్కువ ధరకు ఐఫోన్ 17 ప్రో దొరుకుతుండటంతో ఈ ఆఫర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ ఆఫర్ అనేది మొత్తం నాలుగు రకాల ప్రయోజనాలను కలిపి రిలయన్స్ డిజిటల్ ఈ రేటును నిర్ణయించింది. ఇన్-స్టోర్ డిస్కౌంట్ కింద రూ.9,910 వరకు తగ్గుతుంది. అలాగే పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా గరిష్టంగా రూ.55,000 వరకు వ్యాల్యూ పొందే వెసులుబాటు ఉంది. దీనికి అదనంగా రూ.10,000 ప్రత్యేక ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.3,000 క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. ఇలా మొత్తం రూ.77,910 వరకు లబ్ధి పొందవచ్చు.

Advertisement

Also Read: 20 ఏళ్ల ఐఫోన్ జర్నీకి గ్రాండ్ ట్రీట్.. iPhone 20లో ఈ మార్పులు చూస్తే పిచ్చెక్కిపోతారండి బాబూ!

ఈ డీల్‌లో ఎక్కువ ఆదా చేసుకోవడానికి పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫరే కీలక పాత్ర పోషిస్తుంది. ‘స్వాప్ ఈజీ’ పద్ధతి ద్వారా మీ పాత ఫోన్ కండిషన్ బట్టి ఎంత ధర వస్తుందో ముందే పక్కాగా తెలుసుకోవచ్చు. దీనికి రూ.10,000 బోనస్ తోడవ్వడంతో కొత్త ఫోన్ ధర గణనీయంగా తగ్గిపోతుంది. ఇక ఐఫోన్ 17 ప్రో మాక్స్ వేరియంట్ కూడా అన్ని ఆఫర్లు పోను కేవలం రూ.71,990 నుంచే లభిస్తోంది.

Advertisement

ఒకేసారి పూర్తి నగదు చెల్లించలేని వారి కోసం నో-కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు కావాల్సిన అన్ని రకాల కలర్ వేరియంట్లు వెయిటింగ్ లిస్ట్ లేకుండా స్టోర్లలో సిద్ధంగా ఉంచామని రిలయన్స్ డిజిటల్ స్పష్టం చేసింది.

ఈ ఐఫోన్ 17 ప్రో సిరీస్ ఆఫర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్లతో పాటు, మై జియో స్టోర్లలో నేరుగా లభిస్తాయి. ఆన్‌లైన్‌లో కొనాలనుకునే వారు రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్ లేదా జియోమార్ట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. పాత ఫోన్ మార్చి, కొత్త ప్రో మోడల్ ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ టైమ్.

Also Read: బ్యాటరీ కింగ్ Vivo Y21 5Gపై ఏకంగా 25,500 తగ్గింపు.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి!

Tags

Related News

స్నాప్‌డ్రాగన్ X2 ప్లస్‌తో Microsoft Surface.. 22.5 గంటల బ్యాటరీ, ధరెంతో తెలిస్తే?

బ్యాటరీ కింగ్ Vivo Y21 5Gపై ఏకంగా 25,500 తగ్గింపు.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి!

సేవింగ్స్ పెంచుకోవడంలో..ఫిక్స్‌డ్ డిపాజిట్,మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది బెస్ట్?

సిలిండర్ మోయాల్సిన పనే లేదు..తడి క్లాత్‌తోనే ఎంత ఖాళీ ఉందో కనిపెట్టేయెచ్చు

మిక్సీ కాలిపోయిన వాసన వస్తుందా? మీరు వెంటనే చేయాల్సిన పని ఇదే!

ఫోన్ ఛార్జర్లు వేడెక్కడం సాధారణమేనా? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

20 ఏళ్ల ఐఫోన్ జర్నీకి గ్రాండ్ ట్రీట్.. iPhone 20లో ఈ మార్పులు చూస్తే పిచ్చెక్కిపోతారండి బాబూ!

Big Stories

Advertisement
×