Nani–Srikanth Odela Bond: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ప్యారడైజ్ సినిమా థియేటర్ లో డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెల్సిందే.అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 114 కోట్లు కొలగొట్టింది.ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్.
ఇందులో భాగంగా డైరెక్టర్ మాట్లాడుతూ నానికి ,తనకి మధ్యగల అనుబంధాన్ని వివరిస్తూ చెప్పినమాటలు ఇపుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని వార్తలు చదివానని తెలిపాడు.
సినిమాకి మించిన అనుబంధం
నానికి నాకూ చాలా గొడవలు అవుతుంటాయని, వాటిలో నాని అన్న తిట్టిండు,తన్నిండు .శ్రీకాంత్ గాడు అలిగిండు, శ్రీకాంత్ గాడు అరిచిండు ,ఇలా నాని అన్నకి నాకు ఏవేవో గొడవలు అయ్యాయని విన్నాను. వీటిలో నాని నన్ను తిట్టిన మాట వాస్తవమే ,నేను నాని అన్న మీద అలిగిన మాట వాస్తవమే ఉండొచ్చు కాని మా మధ్య ఉండే ఎమోషన్ ని ఒక దసరానో లేక ఒక ప్యారడైజ్ లేక త్వరలో చేయబోయే మరో సినిమాలో పెట్టకూడదు అని చెప్పుకొచ్చాడు.
వాటికి మాత్రమే పరిమితం కాదు
వేరే డైరెక్టర్స్ నాని అన్నతో సినిమాలు చేస్తే వారి ఎమోషన్స్ ని ఆ సినిమాల్లోనే పెట్టవచ్చో లేదో అది వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కాని మా ఇద్దరి ఎమోషన్స్ ని మాత్రం కేవలం సినిమాలకి మాత్రమే పరిమితం చేయొద్దని నానికి తనకు మధ్య గల ఎమోషనల్ బాండింగ్ ని బయటపెట్టాడు.
ఇంకా మాట్లాడుతూ ఆయన నన్ను భరించాలని ,నన్ను మోయడం తప్ప వేరే ఆప్షన్ లేదని అసలు దాంట్లో సమస్యే లేదని,ఆయనే తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి ,అదే నాని అన్ననే మోయాలని ,మోస్తాడని సరదాగా నవ్వులు పూయించాడు.
మేము మూతులు నాక్కుంటం
మేమిద్దరు తన్నుకుంటం,ముద్దులు పెట్టుకుంటం ,మూతులు నాక్కుంటం, అంటే అది ఏదున్నా కొన్ని ఎమోషన్స్ బతుకు దగ్గర ఆగకూడదు ,సావు ని దాటి చూడాలి కొన్ని ఎమోషన్స్ దాంట్లో నాని అన్న ఒకరు .మా ఇద్దరి మధ్య బాండింగ్ ఇక్కడ ఆగిపోయేది కాదు అని చివర్లో నాని అన్న థాంక్స్ అని చెప్పి మళ్ళీ నాని అన్నకి థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదులే అంటూ సరదాగా తన స్పీచ్ ని ముగించాడు నాని.
మొత్తంగా నానికి ,తనకి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ కేవలం సినిమాలకే పరిమితం కాదన్నా శ్రీకాంత్ కామెంట్స్ ఇపుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి !
also read :చిరు – శ్రీకాంత్ ఓదెల సినిమా అటకెక్కినట్టేనా ?