E-Paper
Advertisement

Korean Kanakaraju: కొరియాలో ‘కొరియన్ కనకరాజు’.. కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

Korean Kanakaraju: కొరియాలో ‘కొరియన్ కనకరాజు’.. కీలక అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
Advertisement

Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. లావిష్ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం హర్రర్, కామెడీని రిఫ్రెషింగ్ క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో బ్లెండ్ తో తెరకెక్కుతోంది. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. టీం ఇప్పుడు ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ సౌత్ కొరియాలో ప్రారంభించింది. కీలకమైన ఒక వారం రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో పాటలు, కథలో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనున్న ఈ షెడ్యూల్‌ ను కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారు.

Read also-Rashmika Mandanna: మరిది పుట్టినరోజు..మిస్ అవుతున్నాం అంటూ రష్మిక స్పెషల్ విషెస్!

Advertisement

వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అద్భుతమైన స్పందనను అందుకుంది. స్టైలిష్ ప్రెజెంటేషన్, ఎంటర్టైనింగ్ టోన్‌తో వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. ఆ వీడియో ఈ చిత్రంలో ఉండే హిలేరియస్ హారర్-కామెడీ వరల్డ్ ని పరిచయం చేసింది. ఈ చిత్రానికి సంగీతం ఎస్. తమన్ అందిస్తున్నారు. ఎనర్జీతో నిండిన పాటలతో పాటు ఎంటర్టైనింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను సమకూరుస్తున్నారు. ఈ సినిమా కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో ప్రధాన భాగం షూటింగ్ పూర్తి కాగా, ఇప్పుడు కొరియాలో జరుగుతున్న ఈ ఫైనల్ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తికానుంది. అనంతరం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి వెళ్ళనుంది.

Read also-Allu Arjun: అల్లు అరవింద్ ఇంటికి ఏపీ సీఎం..క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్..పోస్ట్ వైరల్!

Advertisement

త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మనోజ్ రెడ్డి కాటసాని, ఎడిటింగ్ సత్యా జి నిర్వహిస్తున్నారు. వరుణ్ తేజ్ కరిస్మాటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ హిలేరియస్ స్టొరీ టెల్లింగ్, యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ త్వరలో తెలియజేయనున్నారు.

Related News

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

Big Stories

Advertisement
×