Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : ఆసియా క్రీడాల్లో భాగంగా టీమిండియా వర్సెస్ జపాన్ (Japan vs India) మధ్య రేపు మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు జపాన్ లోని సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. టీమిండియాతో మ్యాచ్ ఉన్న తరుణంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జపాన్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ కుసుద నైర్న్ ( Japan’s Kusuda-Nairn). వైభవ్ సూర్యవంశీ వికెట్ తీయడమే టార్గెట్ పెట్టుకున్నామన్నారు. అతడిని డకౌట్ చేస్తానని హెచ్చరించారు. జపాన్ జట్టును తక్కువ అంచనా వేసి, వైభవ్ బరిలోకి దించవద్దని, తమ బౌలింగ్ దెబ్బకు చుక్కలు చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో వైభవ్ పై జపాన్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ కుసుద నైర్న్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఆసియా క్రీడాల్లో భాగంగా మంగళ వారం జపాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో జపాన్ జట్టుపై 20 ఓవర్లలోనే 500ల పరుగులు సాధించడం గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మంగళ వారం రోజున జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా చేతిలో జపాన్ దారుణంగా ఓడిపోతుందని అంచనా వేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అందరూ ఇరగదీయడం పక్కా అంటున్నారు. ఇలాంటి తరుణంలోనే టీమిండియాకు డేంజర్ బెల్స్ పంపిస్తున్నారు జపాన్ ప్లేయర్లు. రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తామని హెచ్చరికలు పంపారు .. జపాన్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ కుసుద నైర్న్ ( Japan’s Kusuda-Nairn). వైభవ్‌ను తొలి బంతికే ఔట్ చేస్తామని, తమ దెబ్బకు ఇంటికి పారిపోతాడని పరువు తీశారు. టీమిండియా మిగతా ప్లేయర్లు కూడా ఇలాగే ప్యాకప్ కావడం పక్కా అంటూ హెచ్చరించారు. ఈ మ్యాచ్ లో గెలిపే లక్ష్యంగా, ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
టీమిండియా వర్సెస్ జపాన్ (Japan vs India) మ్యాచ్ మంగళ వారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు షురూ కానుంది. 12.30 గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. భారత కాలమానం ప్రకారం మాత్రం 9.30 గంటలకు షురూ కానుంది. సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ ఛానెల్స్ లలో ప్రసారం కానుంది. ఫ్యాన్ కోడ్ (Fan Code) యాప్ లేదా వెబ్ సైట్ లో స్ట్రీమింగ్ కానుంది.