Mahavatar Narasimha Collections : మాస్ సినిమాలు, భారీ యాక్షన్, రొమాంటిక్ సినిమాలు కాకుండా జనాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్ర డైరెక్టర్స్ కూడా కొత్తగా సినిమాలు ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉంటున్నారు. ప్రస్తుతం పురాణాలు మీద, దేవుళ్ళ కథలతో కొత్త సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈమధ్య వస్తున్న సినిమాలకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహకు మంచి రెస్పాన్స్ వస్తుంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపుతోంది. హరిహర వీరమల్లుకు పోటీగా ఒక రోజు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమా మీద ముందు పెద్దగా అంచనాలు లేవు. తక్కువ షోలు పడ్డ కూడా బాక్సాఫీస్ వద్ద సత్తాని చాటుతుంది. రిలీజ్ అయిన అతి కొద్ది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరిపోయింది. మరి ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..
‘మహావతార్ నరసింహ ‘ కలెక్షన్స్..
ఈ మూవీ జూలై 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నరసింహ స్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా మైథాలజికల్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. ఫస్ట్ డే కోటి 70 లక్షల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది.. మొత్తం నాలుగు రోజులకు గాను దాదాపుగా 23 కోట్లు వసూల్ చేసింది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయె తప్ప తగ్గడం లేదు. తొమ్మిది రోజులకు గాను 80 నుంచి 100 కోట్లు వసూల్ చేసిందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పది రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడంతో పాటుగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మరి ఈ కలెక్షన్స్ నిజమో కాదో తెలియాలంటే టీమ్ అధికారికంగా ప్రకటించేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..
Also Read : ‘ఓజీ ‘ ఫైర్ సాంగ్.. సౌండ్ బాక్స్ పగిలిపోయింది.. ఫ్యాన్‌కు థమన్ గిఫ్ట్
బుక్ మై షోలో రికార్డ్ బ్రేక్…
మహావతార్ నరసింహ జులై 25న ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం వెండితెరపై ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. ఒకవైపు పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో పాటుగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. బుక్ మై షోలో సండే ప్రతి గంటకు సగటున 11 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్న చిత్రం మహావతార్ నరసింహ ఒక్కటే. దీని ఓవర్ ఫ్లోస్ ఇతర సినిమాల కలెక్షన్లకు ఉపయోగపడుతున్నాయనే కామెంట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.. దాదాపు 80 కోట్ల కలెక్షన్స్ ను అందుకున్న ఈ మూవీ 100 కోట్లు వసూల్ చెయ్యడం మామూలు విషయం కాదు. మహావతార్ నరసింహ ఇప్పట్లో శాంతించేలా లేదని ఇండస్ట్రీ టాక్. ఆగస్ట్ 14 కూలి, వార్ 2 వచ్చేదాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని అంటున్నారు. సహనిర్మాతగా ఉన్న హోంబాలే ఫిలింస్ సైతం ఇంత పెద్ద రెస్పాన్స్ ఊహించలేదేమో.. కేవలం 4 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. చూద్దాం ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో మరి..