Meenakshi Chaudhary: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా వచ్చినా… కొంతమంది నటీనటులు ఒకే సినిమా కోసం పూర్తిగా అంకితమవుతారు. అలాంటి అరుదైన హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఒక సంవత్సరం పాటు ఆమె కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోకుండా..పూర్తిగా అనగనగా ఒక రాజు సినిమాపైనే దృష్టి పెట్టింది. ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటించారు. ఇక అలాంటి మామూలు చిన్న హీరో సినిమా కోసం కూడా మీనాక్షి ఎన్ని ప్రాజెక్టులు త్యాగం చేసుకుని మరీ వెయిట్ చేయడం అందరిని కొన్ని అనుమానాలకు గురిచేసింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమాతో అందరికీ సమాధానం దొరికింది.
గత సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మీనాక్షి చౌదరి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమా హిట్ కావడంతో మీనాక్షి చౌదరికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయినా కూడా ఆమె వాటన్నిటినీ పక్కన పెట్టి అనగనగా ఒక రాజు సినిమాకు మాత్రమే కమిట్ అయింది. ఈ సినిమా కోసం ఒక పూర్తి సంవత్సరం సమయం కేటాయించాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం నిర్మాత నాగ వంశీ, హీరో నవీన్ పోలిశెట్టి అభ్యర్థన మేరకు తీసుకున్నదని సమాచారం.
ఒకే సినిమా కోసం ఏడాది పాటు కొత్త అవకాశాలను వదులుకోవడం అంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి. సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, మీనాక్షికి లోపల కొంత భయం కూడా ఉండేదట. కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనగనగా ఒక రాజు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కథ, వినోదం మాత్రమే కాకుండా మీనాక్షి నటన కూడా ప్రత్యేకంగా ప్రశంసలు పొందింది.
ఈ సినిమాతో మీనాక్షి చేసిన పాత్ర చాలా సహజంగా, బలంగా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఆమె కష్టపడి చేసిన పని వృథా కాలేదని ఈ విజయం నిరూపించింది. ఒక సంవత్సరం వెయిట్ చేసినా సరే, మంచి సినిమా వస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా ఉదాహరణగా నిలిచింది.
సంక్రాంతి సీజన్ మీనాక్షికి లక్కీగా మారిందని చెప్పాలి. గత సంవత్సరం ఒక హిట్, ఇప్పుడు మరో హిట్. వరుసగా సంక్రాంతికి ఆమె సినిమాలు విజయం సాధించడంతో, ఆమెను “సంక్రాంతి లక్కీ చార్మ్”గా అభిమానులు భావిస్తున్నారు.
ఇక ముందుకి చూస్తే..మీనాక్షి చౌదరి పెద్ద హీరోలతో సినిమాలు చేసి తన ప్రతిభను మరింత పెద్ద స్థాయిలో చూపించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఆమె తదుపరి సినిమా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ తాజా విజయం తర్వాత ఆమె కెరీర్ మరింత ముందుకు వెళ్లడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: Nari Nari Naduma Murari: రాంగ్ టైంలో బరిలోకి దిగిన శర్వానంద్.. లేకపోతే రఫ్ ఆడిచ్చుంటారు..!