E-Paper
Advertisement

Flourless Cake Recipe: షుగర్-ఫ్రీ ఫ్లోర్‌లెస్ కేక్.. మైదా లేకుండానే ఇలా రెడీ చేయండి

Flourless Cake Recipe: షుగర్-ఫ్రీ ఫ్లోర్‌లెస్ కేక్.. మైదా లేకుండానే ఇలా రెడీ చేయండి
Advertisement

Flourless Cake Recipe: డయాబెటిస్ ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునే వారు స్వీట్లకు దూరంగా ఉండటం చూస్తుంటాం. కానీ మైదా, చక్కెర లేకుండా కూడా ఎంతో రుచికరమైన కేక్ తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ‘ఫ్లోర్‌లెస్ చాక్లెట్ కేక్’ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. సులభమైన పద్ధతిలో ఈ కేక్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

Advertisement

డార్క్ చాక్లెట్ (చక్కెర లేనిది): 200 గ్రాములు

వెన్న లేదా కొబ్బరి నూనె: అర కప్పు

Advertisement

గుడ్లు: 3 పెద్దవి

కోకో పౌడర్: అర కప్పు

స్టేవియా లేదా ఎరిత్రిటాల్ (నేచురల్ స్వీటెనర్): అర కప్పు

వెనిల్లా ఎసెన్స్: 1 టీస్పూన్

చిటికెడు ఉప్పు

తయారీ విధానం :
1. ముందుగా ఒక గిన్నెలో డార్క్ చాక్లెట్ ముక్కలు, వెన్న తీసుకోవాలి. దీనిని ‘డబుల్ బాయిలర్’ పద్ధతిలో (అంటే వేడి నీటి గిన్నె పైన ఈ గిన్నెను ఉంచి) కరిగించాలి. చాక్లెట్ పూర్తిగా కరిగి సాఫ్ట్‌గా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత దీనిని పక్కన పెట్టి కొద్దిగా చల్లార్చాలి.
2. మరొక గిన్నెలో మూడు గుడ్లను తీసుకుని బాగా బీట్ చేయండి. అందులో మనం తీసుకున్న నేచురల్ స్వీటెనర్ (స్టేవియా), వెనిల్లా ఎసెన్స్ ,చిటికెడు ఉప్పు వేసి మిశ్రమం నురుగు వచ్చేలా బాగా కలపాలి.
3. ఇప్పుడు కరిగించిన చాక్లెట్ మిశ్రమాన్ని నెమ్మదిగా గుడ్ల మిశ్రమంలో పోస్తూ కలపాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్త పడాలి. చివరగా, కోకో పౌడర్‌ను జల్లెడ పట్టి ఈ మిశ్రమంలో వేసి మెత్తగా కలుపుకోవాలి. మైదా వాడటం లేదు కాబట్టి, ఈ మిశ్రమం కొంచెం చిక్కగా ఉంటుంది.
4. బేకింగ్ ట్రేకి కొద్దిగా వెన్న రాసి, బట్టర్ పేపర్ వేయండి. సిద్ధం చేసుకున్న కేక్ మిశ్రమాన్ని అందులో పోయాలి. ఓవెన్‌ను 180°C వద్ద 10 నిమిషాల పాటు ప్రీ-హీట్ చేయాలి. ఆ తర్వాత ట్రేని ఓవెన్‌లో ఉంచి 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేయాలి. కేక్ మధ్యలో టూత్‌పిక్ గుచ్చి చూస్తే, అది క్లీన్‌గా బయటకు వస్తే కేక్ రెడీ అయినట్లే.
5. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాతే ట్రే నుంచి బయటకు తీయాలి. దీనిపై కొద్ది గా కో కో పౌడర్ చల్లి లేదా తాజా స్ట్రాబెర్రీలతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.

Also Read: పిల్లల నుంచి పెద్దల వరకు, అందరికీ నచ్చే ప్రొటీన్ కేక్.. క్షణాల్లోనే రెడీ చేయండిలా !

ఆరోగ్య ప్రయోజనాలు:

మైదా లేకపోవడం: మైదా వాడకపోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి ఇది చాలా మంచిది.

చక్కెర లేక పోవడం: దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. డయాబెటిస్ ఉన్నవారు కూడా మితంగా దీనిని ఆస్వాదించవచ్చు.

ప్రోటీన్ : గుడ్లు, డార్క్ చాక్లెట్ వాడటం వల్ల శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ అందుతాయి.

Also Read: లంచ్ బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే.. పిల్లల కోసం 5 స్పెషల్ రెసిపీలు

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×