Indian Railways: ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థలలో ఇండియన్ రైల్వే ఒకటిగా కొనసాగుతోంది. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జర్నీ చేసేలా అనేక నిబంధనలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైల్వే నియమాలను ప్రతి ప్రయాణీకుడు పాటించేలా తప్పనిసరి చేసింది. నిబంధనల ప్రకారం రైలులో కొన్ని వస్తువులను, మరికొన్ని పానియాలను తీసుకెళ్లడం నేరం. అందుకు విరుద్ధంగా వాటిని తీసుకెళ్తే జైలు శిక్ష విధిస్తారు. ఇంతకీ రైళ్లలో తీసుకెళ్లని వస్తువులు ఏవంటే..?
రైళ్లలో తీసుకెళ్లకూడని వస్తువులు!
రైళ్లలో గ్యాస్ సిలిండర్లు, స్టవ్ లు, మండే రసాయనాలు, బాణాసంచా, యాసిడ్స్, తోలు లేదంటే తడి చర్మం, గ్రీజు, సిగరెట్లు, పేలుడు పదార్థాలు, దుర్వాసన వచ్చే పదార్థాలను తీసుకెళ్లకూడదని రైల్వే నిబంధనలు చెప్తున్నాయి. కొన్ని రకాల పండ్లను కూడా తీసుకెళ్లడం నిషేధించారు. రైళ్లలో ప్రయాణీకులు మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. ఇలా చేయడం వల్ల తోటి ప్రయాణీకులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. రైల్వే నిబంధనల ప్రకారం, ఏ ప్రయాణీకుడు మద్యం సేవించి , మాదకద్రవ్యాలు తీసుకొని రైలులో ప్రయాణించకూడదు. ఒకవేళ అలా చేస్తే, రైల్వే యాక్ట్ 1989లోని సెక్షన్ 165 కింద కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా వ్యక్తి మత్తు పదార్థాలు తీసుకుని రైలు లేదా రైల్వే ప్రాంగణంలో ఇతర ప్రయాణీకులను వేధిస్తే వారి టికెట్ ను వెంటనే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, ప్రయాణీకుడు రైల్వే పాస్ హోల్డర్ అయితే, వారి పాస్ ను కూడా రద్దు చేయవచ్చు. అంతేకాదు, ఆ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
పెంపుడు జంతువులను తీసుకెళ్ల వచ్చా?
ప్రయాణీకులు రైలులో పెంపెడు జంతువులను తీసుకెళ్లాలంటే, ప్రత్యేక నియమాలు ఉన్నాయి. గుర్రాలు, మేకలు లాంటి కొన్ని జంతువులను మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. నిబంధనల ప్రకారం, రైలులో గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లడం నిషేధించబడింది. అయితే, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో కొన్ని మార్గదర్శకాలను అనుసరించి సిలిండర్‌ను తీసుకెళ్లవచ్చు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం రైల్వే స్వయంగా వివిధ సౌకర్యాలను అందిస్తుంది. రైల్వే నిబంధనల ప్రకారం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్, పొడి గడ్డి, ఆకులు, వ్యర్థ కాగితం, నూనె, గ్రీజు లాంటి వస్తువులను తీసుకెళ్లకూడదు.
Read Also: ఛీ.. బకెట్ నిండ మలం తెచ్చి మెట్రో ప్రయాణికులపై పోసిన యూట్యూబర్!
కొబ్బరి కాయలను తీసుకెళ్లకూడదు!
రైళ్లలో కొబ్బరి కాయ మినహా మిగతా అన్ని పండ్లను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎండిన కొబ్బరి బయటి భాగం మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల, కొబ్బరికాయను తీసుకెళ్లడం నిషేధించబడింది. రైల్వేలో నిషేధిత వస్తువులను తీసుకెళ్తే, ప్రయాణీకులకు కఠిన శిక్ష విధించే అవకాశం ఉంటుంది. రూ. 1,000 జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు రెండూ విధించే అవకాశం ఉంటుంది.
Read Also: రన్నింగ్ ట్రైన్ లో పెళ్లి కూతురు మిస్సింగ్, ఇంతకీ ఆమె ఏమైనట్టు?