E-Paper
Advertisement

సాయికృష్ణ బూడిదైనా ఇవ్వండి! ఏపీ పోలీసుల‌పై ఎన్‌హెచ్ఆర్సీ సీరియ‌స్‌! వారం గ‌డువు…

సాయికృష్ణ బూడిదైనా ఇవ్వండి! ఏపీ పోలీసుల‌పై ఎన్‌హెచ్ఆర్సీ సీరియ‌స్‌! వారం గ‌డువు…
Advertisement

ఏపీ పోలీస్ వ్య‌వ‌హారం ర‌చ్చ‌కెక్కింది. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో జోక్యం చేసుకుంది. ఓ అడ్వ‌కేట్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ దీన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఏపీ డీజీపీ, విజ‌య‌వాడ సీపీల‌కు వారం గ‌డువిచ్చింది. వెంట‌నే మాయం చేసిన సీపీ పుటేజీల‌ను స‌మ‌ర్పించాల‌ని, సాయికృష్ణ డెడ్‌బాడీని కాల్చేసిన బూడిద‌ను ఇవ్వాల‌ని ఆర్డ‌రేసింది. పోలీసుల చ‌ర్య ఏపీ స‌ర్కార్‌కు మ‌చ్చ తెచ్చి పెట్టింది.

ఇదిప్పుడు దేశ స్థాయిలో చ‌ర్చ‌కు తెర తీసింది. ఓ నిందితుడిని లాక‌ప్ డెత్ చేసి.. బాడీని మాయం చేసేసిన ఘ‌టన‌.. అచ్చంగా దృశ్యం సినిమాను త‌ల‌పించింది. కాల్చి బూడిద చేసి న‌దిలో క‌లిపేశార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. మ‌రి ఆ బూడిద‌ను కూడా ఇవ్వ‌లేని స్థితిలో పోలీసు వ్య‌వ‌స్థ ఇప్పుడున్న‌ది. వారం రోజుల్లో ఏపీ స‌ర్కార్ ఏం చేస్తుంది? జ‌రిగిన త‌ప్పును దిద్దుకుని, ఈ మచ్చ‌ను మ‌రింత పెద్దది చేసుకుని, దేశ వ్యాప్త చ‌ర్చ‌లో భాగంగా మారితే త‌ల‌తీసేన పన‌వువుతుంది చంద్ర‌బాబుకు.

Advertisement

దీనికి కులం రంగు కూడా పుల‌మాల‌నుకున్నారు. ఏదో ఒక విధంగా దీన్ని స‌ద్దుమ‌ణిగేలా చేయాల‌నుకున్నారు. కానీ లాక‌ప్‌డెత్ అని నిర్దార‌ణ జ‌రిగిన త‌రువాత .. ఇది మ‌రింత ర‌చ్చ‌కెక్కింది. దీన్ని దాచాల‌నుకున్నా దాగ‌లేదు. ఏపీ దాటి దేశ స్థాయి చ‌ర్చ‌కు దారి తీసింది. నెల రోజుల సీసీ పుటేజీలు మాయం చేయ‌డం వెనుక‌.. పోలీసు పెద్ద‌ల వ్య‌వ‌హారం ఉంద‌నేది క‌చ్చితంగా తెలుస్తోంది. మ‌రి ఒక్క సీఐ నాగ‌రాజును స‌స్పెండ్ చేసి రిమాండ్‌కు పంపి చేతులు దులుపుకోవాల‌ని చూసినా..మెడ‌కు ప‌డ్డ పాము క‌ర‌వ‌క‌మాన‌దు.. అన్న‌ట్టుగా నాగ‌రాజును ముందుంచి చేసిన ఈ బ‌లి..స‌ర్కార్‌ను వ‌దిలేలా లేదు.

ఏపీలో దీనికి పుల్‌స్టాప్ ప‌డింది. ప్ర‌తిప‌క్షాలు కూడా కొంచెం మెత్త‌ప‌డ్డాయి. నిజం నిగ్గుతేలింది కాబ‌ట్టి.. స‌ర్కార్ ప‌రువు బ‌జారులో ప‌డింది చాలు.. అన్న‌ట్టుగానే వైఎస్ఆర్‌ సీపీ వ్య‌వ‌హ‌రించింది. మొద‌టి నుంచి సాయికృష్ణ ఉదంతంలో రాజ‌కీయంగానే పోరాటం ఉధృతం చేయాల‌ని భావించింది ఆ పార్టీ. లాక‌ప్ డెత్ అని నిరూపణ జ‌రిగిన త‌రువాత ఇది స‌ర్కార్ చేయించిన హ‌త్య‌గా జ‌నాల ముందు ఉంచగ‌లిగామ‌ని, అది తాము సాధించిన విజ‌యంగానే వారు భావిస్తున్నారు.

Advertisement

ఇప్పుడు ఇలా వారి ప్ర‌మేయం లేకుండానే.. ఎన్‌హెచ్ఆర్‌సీ వ‌ర‌కు వెళ్లింది విష‌యం. ఇది రాజ‌కీయంగా ప్ర‌తిప‌క్షానికి ఎంత మేలు చేస్తుందో తెలియ‌దు కానీ.. స‌ర్కార్‌ను మాత్రం బ‌జారుకీడ్చినంత ప‌నైతే చేసింది. ఓవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద్వారా తెలంగాణ‌లో బీజేపీ పాగా వేయాల‌నుకుంటున్న‌ది. ఉన్న ఇల్లును చ‌క్క‌బెట్టుకోనోళ్లు.. ఇక్క‌డికి వ‌చ్చి ఏం చేస్తార‌ని, తెలంగాణ లీడ‌ర్లు ఇప్పుడు ప్ర‌శ్నించేందుకు సిద్దంగా ఉన్నారు.

రాజ‌కీయంగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసే చంద్ర‌బాబుకు ఇది ఊహించ‌ని ప‌రిణామం. ఓ రకంగా వైసీపీ లీడ‌ర్ల‌ను బెదిరించే దాకా వెళ్లాడు చంద్ర‌బాబు. ఎక్కువ చేస్తే ఎన్డీయే ప‌వ‌ర్ చూపిస్తామ‌ని కూడా జ‌గ‌న్‌కు బెదిరించ‌డం ద్వారా ఈ కేసు విష‌యంలో సీరియ‌స్‌నెస్‌ను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నంచాడు.

కానీ.. ఇప్పుడు ఎన్‌హెచ్ఆర్‌సీ జోక్యం చేసుకోవ‌డంతో .. గుప్పిట ఉన్న కేసు బ‌జారుకెక్కిన‌ట్ట‌య్యింది.

Related News

మోసం చేయ‌లేదు.. కానీ మోసపోయా! మోసం ఎందుకు చేశానంటే..? పార్టీ మార‌లేదు. కానీ పార్టీ ఎందుకు మారానంటే..?

హౌసింగ్ స్కీం అట్ట‌ర్ ఫ్లాప్‌.. డబుల్ బెడ్ రూం ఇండ్ల‌పై ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మేలు!

ప్రకాష్ రాజ్‌కు 4 ఓట్లు? ఇప్పుడు ఒక్క ఓటు కూడా లేదా? అసలు.. SIR ఫారం ఇచ్చారా?

ధ‌ర్నాచౌక్‌లో బంధీయైన‌ స్వేచ్ఛ‌..! ఖుల్లం ఖుల్లాగా అల్లం మాట‌లు.. అప్పుడు మాట్లాడ‌లేక‌పోయాం..!

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌కూ జెన్‌జీ భ‌యం! ఎవ‌రికి ప‌ట్టంగ‌డ్తారు? ఆ మూడు పార్టీల్లో టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌!

మోడీ పొర‌పాటు.. ఆర్ఎస్ఎస్ దిద్దుబాటు! జెన్‌జీని మ‌చ్చిక చేసుకునే ప‌నిలో బీజేపీ.. పీచేముడ్‌!

నిను వీడ‌ని బొద్దింక‌లు మేమే! చీఫ్ జ‌స్టిస్ చీఫ్ గెస్ట్‌గా మాకొద్దు.. న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల లేఖ దుమారం!

ఈట‌ల కోసం రేష‌న్ కార్డుల ముద్రణ‌ ఆపేసిన కేసీఆర్‌.. ఆ క‌థా క‌మామీషు ఎట్టిద‌నినా..!

Big Stories

Advertisement
×